RC16 : ఆర్సీ16 టైటిల్, ఫస్ట్ లుక్.. ఊరమాస్ గా రామ్ చరణ్.. పోస్టర్ రివ్యూ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ వచ్చింది. అందరూ ఊహించినట్టుగానే ఆర్సీ16 నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. RC16 చిత్రానికి 'ఉప్పెన' బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తుండటం విశేషం. కాగా ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఆర్సీ16 చిత్రానికి 'పెద్దీ' టైటిల్ ను ప్రకటించారు. అలాగే ఉత్సుకతను రేకిత్తించేలా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. టైటిల్ క్యాచీగా ఉండటంతో సినిమాపై రీచ్ ను పెంచేస్తోంది. మరోవైపు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉండటం విశేషం. ఊరమాస్ లుక్ లో రామ్ చరణ్ దర్శనమిచ్చి సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అమాంతం ఆకాశానికి ఎత్తేశారు.

Ram Charan Buchi babu RC 16 Title and First Look Revealed

పెద్ది.. చిత్రం నుంచి రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. మొదటి పోస్టర్ లో టైటిల్ ను రివీల్ చేస్తూ రామ్ చరణ్ పవర్ ఫుల్ కళ్లను చూపించారు. చుట్టా కాల్చుతూ, గంభీరంగా చూస్తూ కనిపించాడు. ఆ కళ్లలో తను నటించే పాత్ర ఎంత శక్తివంతమైనదే తెలిసిపోతోంది. ఎవరికీ భయపడని తత్వం, ఎలాంటి పరిస్థితినైనా నెగ్గే నేర్పు, పట్టుదల కనిపిస్తున్నాయి. మరోవైపు లాంగ్ హెయిర్, భారీ గడ్డంతో రామ్ చరణ్ ఊరమాస్ లుక్ ను సొంతం చేసుకున్నారు. మరోసారి రంగస్థలాన్ని గుర్తు చేసినట్టు కనిపించింది. కానీ మరో పోస్టర్ లోని రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కొత్తదనాన్ని చూపించింది.

క్రీడా మైదానంలో క్రికెట్ బ్యాట్ తిరగేసి యాక్షన్ మోడ్ లో కనిపించాడు. తన కళ్లు ప్రత్యర్థులను వేటాడబోతున్నట్టు చెబుతున్నాయి. పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో శత్రువులను వణికించేలా కనిపిస్తున్నాడు రామ్ చరణ్. తన వెనక వేలాది మంది జనాల జెండాలు పట్టుకొని నిలుస్తారు. దీంతో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించడమే కాకుండా.. నాయకత్వం కూడా వహించబోతున్నారని అర్థమవుతోంది. ఇక పూర్తిగా తన పాత్ర తాలుకూ లక్షణాలను తెలియజేస్తూ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్ ను పెంచేస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఆటకూలిగా కనిపిస్తారని టాక్. క్రికెట్, కుస్తీ, రగ్బీ, కబడ్డీ వంటి స్టోర్స్ ను చూపించేలా కథ సాగుతుందని తెలుస్తోంది. కాగా పెద్ది ఫస్ట్ లుక్ లో చరణ్ క్రికెట్ బ్యాట్ తిరగేసి కనిపించడంతో ఆ విషయం స్పష్టమవుతోంది. అలాగే చరణ్ క్రీడాకారులను కొనుగోలు చేసి కొంతమంది ఆటలు ఆడిస్తారని, అలాంటి కొందరు ఒక మేనేజ్ మెంట్ గా ఏర్పడి పెద్ద పోటీలను నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే క్రీడాకారులందరికీ రామ్ చరణ్ పెద్దిగా నాయకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇక శివరాజ్ కుమార్ వీరికి కోచ్ గా ఉంటారని ఇప్పటి వరకు టాక్.

ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్ల పనిచేస్తుండటం విశేషం. అద్భుతమైన విజువల్స్‌ను ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు చిత్రీకరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రానికి భారీ హైప్ నెలకొనగా ప్రస్తుతం ఫస్ట్ లుక్, పోస్టర్ రిలీజ్ కావడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Take a Poll

More from Filmibeat

Read more about: ram charan rc16 peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X