Acharya హిందీ రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. నార్త్ రిలీజ్ ఎప్పుడంటే?
కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరోలు నటించిన ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా అభిమానులను గత ఏడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇక ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా కు సంబంధించిన మీడియా ప్రమోషన్స్ లో కూడా చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా మారిపోయారు.
అయితే అందులో ఎక్కువ బాధ్యతలు రామ్ చరణ్ తీసుకుంటూ ఉండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉండడమే కాకుండా అలాగే ఆయనకు విశ్రాంతి కూడా తగినంత కావాలి కాబట్టి బయట ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడం లేదు. ఇక రామ్ చరణ్ తేజ్ అటు ప్రింట్ మీడియా ఇటు డిజిటల్ వెబ్ మీడియా ను కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన అంశాలను మాత్రమే కాకుండా రామ్ చరణ్ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఆచార్య సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ విషయం పై కూడా రామ్చరణ్ స్పందించాడు. ఆచార్య సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అని చెప్పిన రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను తప్పకుండా హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. అయితే ఆచార్య హిందీ రిలీజ్ మాత్రం కాస్త ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు రామ్ చరణ్ మీడియాకు తెలియజేశాడు.
ఆచార్య తెలుగులో ఈనెల 29వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఆచార్య హిందీ డబ్బింగ్ సినిమాను మాత్రం ఒక నెల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఇక ఆ సినిమాకు హిందీలో సొంతంగా డబ్బింగ్ కూడా తానే చెప్పబోతున్నట్లు చరణ్ తెలియజేశాడు. RRR సినిమాకు హిందీలో చరణ్ సొంతంగా డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా హిందీలో 250 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకని అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు రామ్ చరణ్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి.
వీరి భవిష్యత్తు ప్రాజెక్టులకు కూడా హిందీలో మంచి మార్కెట్ క్రియేట్ చేస్తాయి అని అర్థమవుతోంది. అయితే ఆచార్య సినిమాను కూడా అక్కడ భారీ స్థాయిలో విడుదల చేయడానికి మెగా టీమ్ సిద్ధమైంది. మరి హిందీ లో ఆచార్య ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక రామ్ చరణ్ తేజ్ జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రావడం లేదు అని మరొక డిఫరెంట్ జానర్ లోనే తెరకెక్కుతోంది అని చెప్పాడు ఇక శంకర్ తో చేస్తున్న 15వ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయిందని త్వరలోనే మరో కీలకమైన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











