రాజకీయాల్లోకి రామ్‌చరణ్? క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'పెద్ది' (Peddi) విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు, పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
పెద్దిలో ఆ ఎపిసోడ్ హైలైట్.. ఉప్పెన కంటే 100 రెట్లు ట్విస్ట్: రామ్ చరణ్
పెద్దిలో ఆ ఎపిసోడ్ హైలైట్.. ఉప్పెన కంటే 100 రెట్లు ట్విస్ట్: రామ్ చరణ్

మెగా కుటుంబం రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనంతరం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఊహిస్తున్నారు.

Recommended For You
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న బిగ్‌బాస్ కళ్యాణ్ పడాల.. కాబోయే భార్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న బిగ్‌బాస్ కళ్యాణ్ పడాల.. కాబోయే భార్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ram Charan Clarifies No Political Entry Focuses on Films and Peddi Promotions

తాజాగా ఒక ఇంటర్వ్యూలో "మీ ఫ్యాన్స్ మిమ్మల్నీ విజయ్ లాగా సీఎంగా చూడాలనుకుంటున్నారు. మీ నాన్న చిరంజీవి, మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? " అని ప్రశ్నించగా.. తనకు ఆ ఆలోచన లేదని, సినిమాల్లో అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటానని రామ్ చరణ్ బదులిచ్చారు. 'నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. వినోద రంగంలో నేను బెస్ట్ అనిపించుకోవాలని, నెంబర్ 1 స్థానంలో నిలవాలని మాత్రమే కోరుకుంటున్నాను. నేను రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మా నాన్న, బాబాయ్ ని రాజకీయాల్లో చూసాను. నాకు అలాంటి ఆశ లేదు. నేను రెండు పడవలపై ప్రయాణించదలుచుకోలేదు. సినిమాలు నాకు చాలు' అని చెప్పుకొచ్చాడు.
You May Also Like
పెద్దితో జాన్వీ లెవెల్ మారింది.. రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే!
పెద్దితో జాన్వీ లెవెల్ మారింది.. రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే!

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తుండగా, మరికొందరు చరణ్ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టడం సరైన నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. 'పెద్ది' తన కెరీర్‌లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని చరణ్ చెప్పాడు. "ఇది చాలా రూటెడ్ స్టోరీ. గ్రామీణ నేపథ్యంలో తన ఐడెంటిటీ వెతుక్కునే వ్యక్తి ప్రయాణం.ఈ రోల్ కోసం తాను శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాల్సి వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి డ్రామా ఉంటుంది" అని చెప్పారు.

SRH ఓనర్‌తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ డేటింగ్.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారా?
SRH ఓనర్‌తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ డేటింగ్.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారా?

యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ, "రిస్కీ షాట్స్ సినిమాలో నేను స్వయంగా నటించడానికి ఇష్టపడతాను. డూప్ ఉపయోగించను. మనమే చేస్తేనే ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు చేరుతుంది" అని పేర్కొన్నారు. తన తండ్రి చిరంజీవి గురించి కూడా చరణ్ గర్వంగా ప్రస్తావించారు. "71 ఏళ్ల వయసులో కూడా మా నాన్న స్టంట్స్ చేస్తున్నారు. అది నాకు గొప్ప ప్రేరణ" అని అన్నారు. అలాగే కెరీర్‌లో హిట్, ఫ్లాప్‌లను పట్టించుకోనని, తనకు నచ్చిన పనినే ఎప్పుడూ చేస్తానని. స్టార్‌డమ్ గురించి పెద్దగా ఆలోచించనని, తన పని పట్ల నిజాయతీగా ఉండడమే ముఖ్యమని చెప్పారు.మొత్తంగా రామ్ చరణ్ తన కెరీర్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టి, సినిమాల్లోనే అగ్రస్థానాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X