వైష్ణవ్ తేజ్‌ను స్వాగతించిన చిట్టిబాబు.. ఉప్పెనకు చెర్రీ మాటసాయం
మెగా హీరోలా లిస్ట్‌లో మరో నెంబర్ చేరబోతోంది. ఇప్పటికే అరడజన్ మంది ఉండగా మరో కొత్త హీరో చేరబోతోన్నాడు. సుప్రీమ్ హీరో, మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంలో తెరంగేట్రం చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ వేవ్ ఓ రేంజ్‌లో రచ్చ చేశాయి.

హీరో, హీరోయిన్స్ రివీల్..
మొదటి నుంచి ఉప్పెన చిత్ర యూనిట్ హీరోను దాచి పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది. పోస్టర్ రిలీజ్ చేసిన ప్రతీ సారి బ్యాక్ నుంచి చూపెట్టడమే తప్పా వైష్ణవ్ తేజ్ లుక్‌ను పూర్తిగా చూపెట్టలేదు. హీరోయిన్ విషయంలోనూ అంతే. అయితే రీసెంట్ వీరిద్దరిని పరిచయం చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఆసి, సంగీత పాత్రల్లో..
హీరో వైష్ణవ్ తేజ్ ఆసి అనే పాత్రలో నటిస్తుండగా.. సంగీత క్యారెక్టర్‌లో క్రితి శెట్టి నటిస్తోంది. వీరిద్దరిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఫస్ట్ వేవ్ అంటూ రిలీజ్ చేసిన టీజర్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.

ఈ ప్రయాణం కచ్చితంగా నచ్చుతుంది..
తాజాగా ఉప్పెనపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ... ‘వైష్ణవ్ తేజ్ ఘన స్వాగతం.. నీకు కచ్చితంగా ఈ ప్రయాణం నచ్చుతుంది.. పూర్తిగా ఆస్వాదించు.. దర్శకుడు బుచ్చిబాబు సనా, క్రితి శెట్టి, విజయ్ సేతుపతి, దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్' అంటూ పోస్ట్ చేశాడు.
Recommended Video


తాజాగా మరో పోస్టర్
పోస్టర్లతో ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన యూనిట్.. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసింది. హీరో వెంటపడుతుండగా.. హీరోయిన్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ వెళ్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర చిత్రీకరణ, ఆయన నటన మరో లెవెల్‌లో ఉంటుందని ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











