Game Changer Trailer: గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది..రామ్ చరణ్ బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా..

Game Changer Trailer Launch: టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' సినిమా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్లు కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జే సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల అయింది. గేమ్ చేంజర్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన చేతులమీదుగా రిలీజ్ చేశారు.


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దాదాపు 400 కోట్లకు బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. ఆయన కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ గా గేమ్ చేంజర్ నిలిచింది.

Ram Charan-director Shankar Game Changer trailer released by director SS Rajamouli

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ ప్రారంభంలో సైలెంట్ బీజీయం వస్తుంది.. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే.. పెద్దగా దానికి వచ్చే నష్టమేమీ లేదు. అది లక్ష జీవాలకు ఆహరం. నేను కూడా అడిగేది ఆ ఒక్క ముద్ద మాత్రమే' అంటూ రామ్ చరణ్ డైలాగ్ తో స్టార్ అవుతుంది. బ్యాక్ డ్రాప్లో కొన్ని పొలిటికల్ సీన్స్ కనిపిస్తుంటాయి. దాన్నిబట్టి ప్రత్యర్థులు రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ సమయంలో 'కలెక్టర్ కు ఆకలేస్తుందట.. ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు' అంటూ టీజ్ చేయడం చూడవచ్చు.

ఇతర సినిమా టీజర్ లాగా ఈ టీజర్ లో అంతగా పెద్ద డైలాగులు లేవు. డైరెక్టర్ శంకర్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా విజువల్స్ చూపిస్తూ.. ఇన్ డైరెక్ట్ గా కథ చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే రామ్ చరణ్ డ్యూయల్ రోల్ గెటప్, కాలేజీ అబ్బాయిగా.. కలెక్టర్ గా.. ఓల్డ్ గెటప్ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ లో వైవిధ్యం కనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లలో రామ్ చరణ్ పోలీస్ డ్రెస్ లో కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాలి. అయితే రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడా? లేకపోతే ట్రిపుల్ రూల్స్ చేస్తున్నాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎస్జె సూర్య, శ్రీకాంత్ తదితరులు తమ గెటప్స్ తో పాటు డైలాగ్స్ తోను ఆకట్టుకున్నారు.ఎస్ జే సూర్య ఈసారి గేమ్ ఛేంజర్ పొలిటీషియన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సునీల్ , బ్రహ్మానందం కామెడీ హైలెట్గా నిలిచే అవకాశం లేకపోలేదు. కియారా అద్వానీ గ్లామర్ రోల్ లో మెరిస్తే.. అంజలి పల్లెటూరు అమ్మాయి పాత్రలో మెరిసింది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ ను హైలెట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ సినిమా రాజకీయ నాయకుడికి, ఓ ప్రభుత్వ ఉద్యోగి మధ్య జరిగిన పోరాటం లాగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ శంకర్.

చివరిలో 'నువ్వు 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్.. నేను లైఫ్ లాంగ్ ఐఎస్ ఆఫీసర్" అని చెప్పే డైలాగ్ మొత్తం ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. మొత్తానికి ఈ ట్రైలర్లు రామ్ చరణ్ క్లాస్ అండ్ మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. అలాగే డైరెక్టర్ శంకర్ తన విజువల్ వండర్ను మరోసారి ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతుంది. గేమ్ చేంజర్ టైలర్ మాత్రం మెగా ఫాన్స్ కు పక్కా ఫుల్ మీల్స్ గా ఎంటర్టైన్ చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులను ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: ram charan shankar rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X