‘ఆచార్య’ మూవీ నుంచి షాకింగ్ అప్‌డేట్: రామ్ చరణ్‌ పాత్రకు అది కూడా ఉంటుందట

'సైరా: నరసింహారెడ్డి' వంటి ఏవరేజ్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య'లో రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో అతడు భాగమయ్యాడు. దాదాపు ముప్పై నిమిషాలు పాటు ఉండే అతడి రోల్ సినిమాను మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఇందులో అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు హీరోయిన్‌కు మధ్య ఓ డుయెట్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఓ మెలోడీ సాంగ్‌ను కంపోజ్ చేసి పెట్టాడట మణిశర్మ.

Ram Charan Duet song in Chiranjeevis Acharya

ఇదిలా ఉండగా, 'ఆచార్య' మూవీ టీజర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్‌ను కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇందులో కేవలం చిరంజీవి పార్టునే చూపించబోతున్నారని అంటున్నారు. మరోవైపు, దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాడే వ్యక్తి కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X