Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఉపాసనకు రాంచరణ్ ఎమోషనల్ బర్త్ డే విషెస్.. సతీమణి రియాక్షన్ ఏమిటంటే..
మెగా కోడలు, రాంచరణ్ సతీమణి అపోలో హాస్పిటల్లో కీలక బాధ్యతలు వహిస్తున్న ఉపాసన కొణిదెల జన్మదినం జూలై 20. ఈ సందర్భంగా మెగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఉపాసన తన జన్మదినాన్ని అత్యంత నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించారు.
ఉత్తమ విలువలను, సామాజిక సేవలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న తన సతీమణి ఉపాసనకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎమోషనల్‌గా శుభాకాంక్షలు అందజేశారు. సేవలో చిన్న, పెద్ద అనే వ్యత్యాసాలు చూడకుండా నీలో స్పందించే దయార్ధ హృదయం నన్ను ఎంతో ఆకట్టుకొంటుంది. నీవు నమ్మిన సిద్దాంతాన్ని అంతకరణశుద్దితో అమలు చేస్తే నీకు లభించాల్సిన ఉత్తమ ప్రశంసలు అవే వస్తాయి. హ్యాపీ బర్త్ డే అంటూ రాంచరణ్ తన బర్త్ డే సందేశాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.
రాంచరణ్ చేసిన పోస్టుపై ఉపాసన స్పందిస్తూ.. నాపై కురిపించిన ప్రేమ, నాకు ఇస్తున్న సపోర్టుకు థ్యాంక్యూ. నీవు చూపించే అభిమానంలో తడిసి ముద్దయ్యాను అంటూ ట్విట్‌కు స్పందించారు.
ఇక రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే.. నిర్మాతగా ఆచార్యను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వం వహించే రౌద్రం, రణం, రుధిరం అనే సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు పాత్రలో చెర్రీ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.