twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉపాసనకు రాంచరణ్ ఎమోషనల్ బర్త్ డే విషెస్.. సతీమణి రియాక్షన్ ఏమిటంటే..

    |

    మెగా కోడలు, రాంచరణ్ సతీమణి అపోలో హాస్పిటల్‌లో కీలక బాధ్యతలు వహిస్తున్న ఉపాసన కొణిదెల జన్మదినం జూలై 20. ఈ సందర్భంగా మెగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఉపాసన తన జన్మదినాన్ని అత్యంత నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించారు.

    ఉత్తమ విలువలను, సామాజిక సేవలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న తన సతీమణి ఉపాసనకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎమోషనల్‌గా శుభాకాంక్షలు అందజేశారు. సేవలో చిన్న, పెద్ద అనే వ్యత్యాసాలు చూడకుండా నీలో స్పందించే దయార్ధ హృదయం నన్ను ఎంతో ఆకట్టుకొంటుంది. నీవు నమ్మిన సిద్దాంతాన్ని అంతకరణశుద్దితో అమలు చేస్తే నీకు లభించాల్సిన ఉత్తమ ప్రశంసలు అవే వస్తాయి. హ్యాపీ బర్త్ డే అంటూ రాంచరణ్ తన బర్త్ డే సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

    Ram Charan emotional birthday wishes Upasana Konidela

    రాంచరణ్ చేసిన పోస్టుపై ఉపాసన స్పందిస్తూ.. నాపై కురిపించిన ప్రేమ, నాకు ఇస్తున్న సపోర్టుకు థ్యాంక్యూ. నీవు చూపించే అభిమానంలో తడిసి ముద్దయ్యాను అంటూ ట్విట్‌కు స్పందించారు.

    ఇక రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే.. నిర్మాతగా ఆచార్యను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వం వహించే రౌద్రం, రణం, రుధిరం అనే సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు పాత్రలో చెర్రీ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

    English summary
    Ram Charan wishes Upasana Konidela with emotionally on her birthday. Ram Charan tweeted that, Your act of kindness, no matter how small, is never wasted. Hope you continue do so as rewards will follow. Happy birthday!!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X