నా హీరో నుంచి ఆ మాటలా!.. అప్పా అంటూ చిరుపై ప్రేమను కురిపించిన రామ్ చరణ్
రామ్ చరణ్ పుట్టిన రోజున అభిమానులకు కావాల్సిన హంగామా, సందడి అంతా దొరికేసింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్పిన విషెస్ రామ్ చరణ్ పుట్టిన రోజు విషయం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రామ్ చరణ్ విషెస్ ఓ వైపు, ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ మరోవైపు మొత్తానికి ఈ రోజంతా మెగా అభిమానుల సందడే కనిపిస్తోంది.

ట్విట్టర్‌లో చిరు హల్చల్..
ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంటైరన చిరంజీవి.. దుమ్ములేపేస్తున్నాడు. ఎమోషనల్ ట్వీట్స్ చేయడమే కాకుండా.. అందరికీ తనదైన శైలిలో కౌంటర్స్ వేసేస్తున్నాడు. చిరు దూకుడు చూసిన నెటిజన్స్.. ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్‌పైనా కామెంట్స్..
ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్‌కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో ఉదయం పది గంటలకు రెడీగా ఉన్నట్టున్నాడు చిరు. ఖైదీ నెంబర్ 150 చిత్రంలోని వెయిటింగ్ అనే డైలాగ్‌ను పోస్ట్ చేశాడు.
చరణ్ బర్త్ డే చిరు ట్వీట్..
‘రామ్ చరణ్ పుట్టినప్పుడు తెలియకుండానే ఉప్పొంగిపోయాను.. అయితే ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడే రామ్ చరణ్ ఎందుకు పుట్టి ఉంటాడు.. దానికి ఓ కారణం ఉందేమోనని అనుకున్నా.. అయితే చేపకు ఈదడం ఎవరు నేర్పారు.. అలాగే చరణ్ కూడా నటనను నేర్చేసుకున్నాడు. చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు
Recommended Video

నా హీరో నుంచి ఆ మాటలు..
హృదయం నిండిపోయేలాంటి మాటలు నా హీరో నుంచి విన్నాను.. వరల్డ్ థియేటర్ డే నాకు ఏదైనా చేసిందో లేదో తెలీదు కానీ, నా అప్పా మాత్రం చేశాడు. విషెస్ చెప్పినందుకు, ఇంత వరకు నాకోసం చేసినదానికి ధన్యవాదాలు. లవ్యూ అప్పా' అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications