బాబాయ్ మైండ్ బ్లోయింగ్.. నీవు ఎప్పుడూ పవర్‌పుల్.. రాంచరణ్ ఎమోషనల్.. రికార్డులు తిరగరాస్తున్న వకీల్ సాబ్

వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డులు తిరగరాస్తున్నది. గంట గంటకు తెలుగు సినిమా చరిత్రంలోని ఒక్కో మైలురాయిని దాటేస్తూ సునామీ సృస్టిస్తున్నది. కొద్ది గంటల్లో టాలీవుడ్‌లో ఏ ట్రైలర్ కూడా సాధించని రికార్డును వకీల్ సాబ్ ట్రైలర్‌ తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ రికార్డులు, రాంచరణ్ కామెంట్ గురించి వివరాల్లోకి వెళితే..

 7 నిమిషాల్లోనే 100k లైక్స్

7 నిమిషాల్లోనే 100k లైక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా భావిస్తున్న వకీల్ సాబ్ ట్రైలర్‌ను మార్చి 29 తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు క్రియేట్ చేసింది. 7 నిమిషాల్లోనే 100k లైక్స్ సాధించింది. 115 నిమిషాల్లోనే 500k లైక్స్ సాధించింది.

బాహుబలి రికార్డు మాయం

బాహుబలి రికార్డు మాయం

ఇక ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సాహో చిత్రం 86 నిమిషాల్లో 200k లైక్స్ సాధిస్తే.. సైరా 137 నిమిషాల్లో, బాహుబలి 2 గంటల 55 నిమిషాల్లో, అరవింద సమేత 3 గంటల 33 నిమిషాల్లో సరిలేరు నీకెవ్వరు 8 గంటల్లో సాధిస్తే.. పవన్ కల్యాన్ నటించిన వకీల్ సాడబ్ ట్రైలర్ కేవలం 19 నిమిషాల్లోనే 200k లైక్స్ సొంతం చేసుకోవడం ఓ సంచలనంగా మారింది. అంతేకాకుండా కేవలం 3 గంటల 3 నిమిషాల్లో ఈ ట్రైలర్ 600k లైక్స్ సాధించడం టాలీవుడ్‌లోనే ఓ రికార్డుగా మారింది.

టాలీవుడ్‌లో వకీల్ సాబ్ కొత్త రికార్డు

టాలీవుడ్‌లో వకీల్ సాబ్ కొత్త రికార్డు

వకీల్ సాబ్ ట్రైలర్ మరో ఘనతను సొంతం చేసుకొన్నది. 24 గంటల్లో బాహుబలి2 చత్రం 497k లైక్స్ సాధిస్తే.. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం కేవలం 117 నిమిషాల్లోనే 500k లైక్స్ సాధించడం విశేషంగా మారింది.

టాలీవుడ్‌లో మోస్ట్ లైక్స్ వచ్చిన ట్రైలర్‌గా

టాలీవుడ్‌లో మోస్ట్ లైక్స్ వచ్చిన ట్రైలర్‌గా


ఇక అంతటితో వకీల్ సాబ్ ట్రైలర్ సునామీ ఆగలేదు. టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 236 నిమిషాల్లోనే 658k లైక్స్ సాధించి తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

 4 గంటల్లోనే 7 మిలియన్ల వ్యూస్

4 గంటల్లోనే 7 మిలియన్ల వ్యూస్

ఇక వకీల్ సాబ్ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన కనిపిస్తున్నది. ఈ ట్రైలర్‌ కేవలం నాలుగు గంటల్లోనే 7 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్‌ను సాధించింది. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్

రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్

ఇదిలా ఉండగా, రికార్డులను తిరగరాస్తున్న వకీల్ సాబ్ ట్రైలర్ గురించి మెగా పవర్ స్టార్ రాంచరణ్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. బాబాయ్ మైండ్ బ్లోయింగ్.. నీవు ఎప్పటికీ పవర్‌ఫుల్ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వకీల్ సాబ్ ట్రైలర్‌ను తన అభిమానులతో పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X