ధర్మస్థలిలోకి ప్రవేశించిన రామ్ చరణ్: ఫైటింగ్‌తోనే మొదలు పెట్టిన మెగా హీరో

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా.. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో రూపొందుతోంది. ఆ కథకు నక్సలిజం పాయింట్‌ను జోడిస్తూ దీన్ని తీస్తున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో ఎన్నో అనుకోని అంతరాలు ఏర్పడడంతో చిత్రీకరణ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదలను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీక్ అయింది.

మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నగర శివారులో నిర్మించిన ధర్మస్థలి సెట్‌లో చిత్రీకరణను జరుపుతున్నారు. దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు సెట్‌లో అడుగు పెట్టాడు. నేటి నుంచి అతడిపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నారు. అలాగే, కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇప్పుడు చరణ్ పార్ట్ పూర్తయిన తర్వాత చిరంజీవిపైనా ఓ యాక్షన్ సీన్ తీస్తారనే టాక్ వినిపిస్తోంది. దాని తర్వాత ఆయన పైనా కొన్ని ముఖ్యమైన సీన్స్ చిత్రీకరించబోతున్నారట.

Ram Charan Entered to Chiranjeevis Acharya Shooting

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఆచార్య'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. సంగీత, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రలను చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X