గుడ్ న్యూస్: IPLలోకి రామ్ చరణ్ ఎంట్రీ.. సిద్ధమైన కొత్త టీమ్.. ఎప్పటి నుంచి అంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రౌద్రం రణం రుధిరం మూవీ అనేక అవార్డులతో పాటు ఆస్కార్ ను సైతం కొల్లగొట్టింది. దీంతో రామ్ చరణ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయి గ్లోబల్ స్టార్ అయ్యాడు. అందుకే ఆయన మార్కెట్ కు అనుగుణంగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే చెర్రీ పలు వ్యాపారాల్లో భాగస్వామి కాగా తాజాగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ తెలిపాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ గేమ్ చేంజర్ వంటి సినిమాల్లో నటించడమే కాకుండా విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతూ మంచి బిజినెస్ మ్యాన్ గా అనిపించుకుంటున్నాడు. రామ్ చరణ్ గతంలో ఒక పోలో టీమ్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ట్రూ జెట్ పేరుతో ఒక విమానయాన సంస్థను ప్రారంభించాడు.

Ram Charan

రామ్ చరణ్ ఓవైపు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇలా విభిన్న రంగాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్న చెర్రీ తాజాగా క్రీడా రంగంలో మరో అడుగు ముందుకేశాడు. ఐపీఎల్ పై ఫోకస్ చేసిన రామ్ చరణ్ వచ్చే ఏడాది ఓ కొత్త టీమ్ ను మనకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయట.

వచ్చే సంవత్సరం అంటే 2024లో ఐపీఎల్ లో రామ్ చరణ్ ఫ్రాంచైజీ నుంచి వైజాగ్ వారియర్స్ టీమ్ అడుగు పెట్టనుంది. గతేడాది ఐపీఎల్ లో గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలు అడుగు పెట్టాయి. తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉంది. కానీ, ఆంధ్రప్రదేస్ నుంచి ఒక్క టీమ్ లేదు. అందుకే వైజాగ్ వారియర్స్ పేరిట ఒక కొత్త ఐపీఎల్ టీమ్ తో వచ్చే ఏడాది నుంచి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ లో ఇప్పటికే వందల కోట్ల పెట్టుబడితో షారుక్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి వంటి వారు ఫ్రాంచైజీ యజమానులుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజులు సగటను సీజన్ కు రూ. వంద కోట్లకుపైగా స్పాన్సర్ షిప్ ల ద్వారా సంపాదిస్తున్నాయి. అందుకే రాణ్ చరణ్ కూడా ఆ దిశగా దృష్టి సారించాడని సమాచారం. కాగా చెర్రీ గేమ్ చేంజర్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X