twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. పవన్ కళ్యాణ్ స్పూర్తితో అంటూ మెగా పవర్ స్టార్

    |

    సామజిక మాధ్యమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది మెగా ఫ్యామిలీ. టెక్నాలజీ బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికగా అందరితో టచ్‌లో ఉండాలనే కోణంలో మెగా కుటుంబం అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఉపాసన సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తుండగా.. ఇక చిరంజీవి, రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగడం మెగా అభిమానుల్లో సంబరాలు నింపుతోంది.

    నిన్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈయన ట్విట్టర్ ఎంట్రీని స్వాగతిస్తూ రాజమౌళి, మహేష్ బాబు, ఉపాసన అభినందనలు తెలిపారు. తాజాగా ఈ రోజు తండ్రి బాటలోనే రామ్ చరణ్ కూడా ట్విట్టర్‌లో అడుగు పెట్టారు. కరోనా వైరస్ నిర్మూలనలో తన వంతు సహకారం ఇదీ అంటూ మొదటి ట్వీట్ చేశారు.

     Ram Charan Entry Into Twitter: First Tweet is..

    కరోనా కల్లోలంతో అతలాకుతలం అవుతున్న దేశాన్ని, తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడంలో భాగమవుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి, పీఎం సహాయనిధికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా 70 రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తున్నాని పేర్కొంటూ మొదటి ట్వీట్ చేశారు రామ్ చరణ్. ప్రభుత్వం ఆదేశించిన రూల్స్ అందరూ పాటించాలని ఆయన పేర్కొన్నారు.

    English summary
    Power star Pawan Kalyan donates 2 crores for Corona Victims aid. Now Ram Charan entered into Twitter and donates 70 lakhs with the inspiration of Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X