కోర్టు మెట్లెక్కిన రామ్ చరణ్! రాజమౌళి సహకారంతో.. అలా సెట్ చేశారట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోర్టు మెట్లెక్కారని తెలుస్తోంది. ఇందుకు దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన వంతు సహకారం అందిస్తునట్లుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ రామ్ చరణ్ కోర్టు మెట్లెందుకు ఎక్కారు? దానికి జక్కన్న సహకారం ఏంటి? వివరాల్లోకి పోతే..

శరవేగంగా RRR

శరవేగంగా RRR

బాహుబలి సిరీస్ తర్వాత అదే రేంజ్ సినిమా చేయాలనే కోణంలో RRR మొదలు పెట్టారు రాజమౌళి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ లను హీరోలుగా తీసుకున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కోర్టులో రామ్ చరణ్.. ఆ కారణంగానే

కోర్టులో రామ్ చరణ్.. ఆ కారణంగానే

ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోని ప్రత్యేక సెట్‌లో జరుపుతున్నారు. ఈ సినిమాలో అల్లువారి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ మరియు ఇతర తారాగణంపై కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ కారణంగానే రామ్ చరణ్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని తెలుస్తోంది.
పగలు మాత్రమే షూటింగ్

పగలు మాత్రమే షూటింగ్

రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్ కేవలం పగలు మాత్రమే చేస్తున్నారట. ఈ మేరకు స్పందించిన రామ్ చరణ్.. తనకు ఉదయం వేళలో రామోజీ ఫిలిం సిటీ వెళ్లడం, పొద్దన్నే అక్కడ షూటింగ్‌లో పాల్గొనడం సరదాగా అనిపిస్తోందని తెలిపాడు.

న్యూ ఇయర్ సర్‌ప్రైజ్

న్యూ ఇయర్ సర్‌ప్రైజ్

గత కొంతకాలంగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ RRR నుంచి ఇప్పటిదాకా రామ్ చరణ్ లుక్ గానీ, ఎన్టీఆర్ లుక్ గానీ విడుదల చేయలేదు. దీంతో మెగా, నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31న ఇరువురు హీరోల అభిమానులకు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

RRR ప్రధాన అసెట్ అదే..

RRR ప్రధాన అసెట్ అదే..

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో అత్యంత భారీ ఖర్చు మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి అందిస్తున్న సంగీతం ప్రధాన అసెట్ కానుందని తెలుస్తోంది.

మిస్ అనుకున్నారు.. కానీ

మిస్ అనుకున్నారు.. కానీ

1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్సులు మిస్ అవుతామేమో అని భావించారు వారి వారి ఫ్యాన్స్. కానీ మెగా, నందమూరి అభిమానులకు కనువిందు చేసేలా ఏడు పాటలు, హోరెత్తిపోయే డాన్సులు రూపొందిస్తున్నారట జక్కన్న.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
విజయేంద్రప్రసాద్ కథ.. రాజమౌళి టేకింగ్

విజయేంద్రప్రసాద్ కథ.. రాజమౌళి టేకింగ్


రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను సమకూరుస్తున్న ఈ సినిమాలో అలియాభట్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X