ముంబైలో రాంచరణ్ అభిమానుల రచ్చ.. సల్మాన్ వేడుకలో బారికేడ్లు విరగగొట్టిన మెగా ఫ్యాన్స్
సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్టే ఈ చిత్రాన్ని జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అయితే ప్రమోషన్‌లో భాగంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ప్లాన్ చేశారు. తాజాగా సోమవారం అంటే డిసెంబర్ 19వ తేదీన RRR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబైలో నిర్వహించారు. ఈ వేడుక కోసం దక్షిణాది నుంచి భారీగా అభిమానులు ముంబైకి బస్సుల్లో వెళ్లడం తెలిసిందే. అయితే ముంబైలో రాంచరణ్ అభిమానులు చేసిన హంగామా జాతీయ పత్రికలను ఆకర్షించాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ముంబైలో జరిగిన RRR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకకు రాంచరణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే అత్యుత్సాహంతో మెగా ఫ్యాన్స్ రచ్చ చేశారు. చరణ్‌ను చేరుకోవాలనే కోరికతో ఆక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగగొట్టారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టడమే కాకుండా వారిని సముదాయించారు.
ఇక RRR తర్వాత రాంచరణ్ తన సొంత నిర్మాణంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి గానీ, మార్చిలో గానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు అనే విషయం తెలిసిందే.
ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న RC15ను ఇప్పటికే పట్టాలెక్కించారు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications