WAKE UP DILRAJU: దిల్ రాజుకు మెగా ఫ్యాన్స్ మాస్ వార్నింగ్.. ఇది శాంపిలే అంటూ ఘోరంగా!

మెగాస్టార్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను చూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను దక్కించుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో కలిసి ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా అభిమానులు ఈ చిత్ర నిర్మాతను టార్గెట్ చేస్తూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు మీకోసం!

చరణ్‌కు భారీ హిట్.. బిగ్ డిజాస్టర్

చరణ్‌కు భారీ హిట్.. బిగ్ డిజాస్టర్

రామ్ చరణ్ ఇటీవలే RRR అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి క్రేజ్ జాతీయ స్థాయికి పెరిగిపోయింది. అయితే, ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన మరో చిత్రం 'ఆచార్య' మాత్రం భారీ డిజాస్టర్‌‌గా మిగిలిపోయింది.

శంకర్‌తో రామ్ చరణ్ భారీ మూవీ

శంకర్‌తో రామ్ చరణ్ భారీ మూవీ

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

షూటింగ్ స్పీడ్‌గా.. చాలా కంప్లీట్

షూటింగ్ స్పీడ్‌గా.. చాలా కంప్లీట్


రామ్ చరణ్ - ఎస్ శంకర్ కలయికలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత రాజమహేంద్రవరంలో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంది. ఆ వెంటనే వైజాగ్‌లోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఇలా ఇప్పటికే టాకీ పార్ట్ చాలా పూర్తి అయింది.

భారీ బడ్జెట్.. క్లైమాక్స్‌ స్పెషల్‌గా

భారీ బడ్జెట్.. క్లైమాక్స్‌ స్పెషల్‌గా


ఇద్దరు స్టార్ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్‌ను హై లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక, ఈ ఎపిసోడ్‌లో బ్లాస్టింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే దీనికి ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించారని తెలిసింది. ఈ ఒక్క పార్ట్ కోసమే దాదాపు రూ. 20 కోట్లు కేటాయించారట. దీనికోసం ఎన్నో స్పెషల్ ప్లాన్స్ చేసుకుంటున్నారు.

సినిమా నుంచి అప్‌డేట్లు లేవుగా

సినిమా నుంచి అప్‌డేట్లు లేవుగా


అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇది మొదలై చాలా కాలమే అవుతోన్నా.. ఈ చిత్రం నుంచి పెద్దగా అప్‌డేట్లు మాత్రం రావడం లేదు. వాస్తవానికి ఎప్పుడో ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ వస్తుందని అనుకున్నా అలా జరగలేదు.

దిల్ రాజుపై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్

దిల్ రాజుపై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ భారీ సినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. కానీ, దీని నుంచి అప్‌డేట్లు రాకపోవడంతో ఫ్యాన్స్ చిత్ర యూనిట్‌పై యమా కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్‌లో ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజును టార్గెట్ చేస్తూ WAKE UP DILRAJU అనే హ్యాష్ ట్యాగ్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

ఇది శాంపిలే అంటూ వార్నింగ్

ఇది శాంపిలే అంటూ వార్నింగ్


రామ్ చరణ్ - శంకర్ మూవీ అప్‌డేట్ కోసం వేచి చూస్తోన్న మెగా అభిమానులు నిర్మాత దిల్ రాజును ట్రోల్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. విజయ్ నటిస్తోన్న 'వారిసు' మూవీకి వరుసగా అప్‌డేట్లు ఇచ్చి.. చరణ్ సినిమాకు ఇవ్వకపోవడంతో దిల్ రాజుకు వాళ్లుంతా వార్నింగ్ ఇస్తున్నారు. అదే సమయంలో WE WANT RC15 UPDATE అనే మరో ట్యాగ్‌ను కూడా బాగా ట్రెండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X