Game Changer: అదిరిపోయిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు పండగే.. చెర్రీ ఏమన్నాడో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్లాప్ కావడంతో తర్వాతి సినిమాను హై రేంజ్ లో ప్లాన్ చేశాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటిస్తూ ఆసక్తికరమైన వీడియోను చేశారు మేకర్స్. తాజాగా మరొక అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చారు.

మెగా ఫ్యాన్స్ కు ట్రీట్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం అంటే మార్చి 26 నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో ఆయనకు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.
ఇందులో భాగంగానే RC15.. అదే గేమ్ చేంజర్ మూవీ టీమ్ ఆదివారం నాడు ఘనంగా బర్త్ డే విషెస్ తెలిపింది. అంతేకాకుండా సోమవారం రోజున చెర్రీ బర్త్ డే గిఫ్టు గా RC15 టైటిల్ అనౌన్స్ చేసి మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ అందించారు.

కీలక పాత్రల్లో వారు..
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియార అద్వానీ రెండోసారి రామ్ చరణ్ తో జత కడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తుండగా.. ఖుష్బూ, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించనున్నారు.

బైక్ పై కూర్చుని స్టైలిష్ గా..
ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ఉదయం RC15 టైటిల్ గేమ్ చేంజర్ అని వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సాయంత్రం చెర్రీ ఫస్ట్ లుక్ కూడా విడదల చేస్తామని అందులో తెలిపారు. చెప్పినవిధంగా చెర్రీ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించిన రామ్ చరణ్ బైక్ పై కూర్చుని.. బ్లాక్ షేడ్స్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. అలాగే స్టైలిష్ హెయిర్ కట్, గడ్డంతో ఇంతకుముందు చూడని సరికొత్త లుక్ లో చెర్రీ కనిపించాడు.

మంచి బర్త్ డే గిఫ్ట్..
బాటమ్ యాంగిల్ నుంచి రామ్ చరణ్ పోస్టర్ లుక్ అదిరిపోయింది. చెర్రీ లుక్ చాలా గ్రాండ్ గా ఉండటంతో సినిమాపై హై రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారగా.. మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక శంకర్ సినిమాలో ఎలాంటి రిచ్ నెస్ ఉంటుందో అలాగే ఫస్ట్ లుక్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పై చెర్రీ సైతం స్పందించాడు. "నేను ఇంతకన్నా మంచి బర్త్ డే గిఫ్ట్ ను అడగలేను" అని రాసుకొచ్చిన రామ్ చరణ్ దర్శక, నిర్మాతలకు థ్యాంక్యూ తెలిపాడు.
కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు..
ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆయన దాదాపు రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే కింగ్ మేకర్ అర్థం వచ్చేలా.. ఎలక్షన్ గుర్తును హైలెట్ చేస్తూ.. ఎన్నికలకు సంబంధించిన కథగా అర్థం అవుతోంది. ఇక శంకర్ తన సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు సామాజిక అంశాలను జోడించి చెప్పడంలో ఎక్స్ పర్ట్ అని తెలిసిందే.


Click it and Unblock the Notifications











