పెద్ది సినిమాపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ.. అంచనాలు పెంచేసిన గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చివరిగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చిన సినిమా కావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫ్యాన్స్, ప్రేక్షకుల అంచనాలను ఆ చిత్రం రీచ్ కాలేకపోయింది. దీంతో రాబోయే చిత్రాలపై రామ్ చరణ్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో పెద్ది అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా కథ, యాక్షన్ సీన్లపై ప్రచారం జరుగుతున్న వేళ రీసెంట్ గా రామ్ చరణ్ పెద్దిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాంతో సినిమాపై మరింతగా అంచనాలు నెలకొన్నాయి..
పెద్ది సినిమా వివరాలు..
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పెద్ది. ఈ చిత్రానికి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. జగపతి బాబు కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

రామ్ చరణ్ రివ్యూ..
ఇప్పటికే పెద్ది చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్యలో విడుదల చేసిన గ్లింప్స్ తో అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. ఇక ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాపై తన ఫస్ట్ రివ్యూను కూడా అందించారు. పెద్ది చిత్రం కథ చాలా యూనిక్ గా ఉంటుందని, ఆర్ఆర్ఆర్, రంగస్థలం వంటి చిత్రాలకు మించిన కథను చెప్పబోతున్నామని అన్నారు. ఇక రంగస్థలం చిత్రం తో రామ్ చరణ్ నటన, బాక్సాఫీస్ నెంబర్స్ లో సక్సెస్ సాధించారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో చెర్రీ ఆ రెండు చిత్రాలను మించి ఉంటాయని చెప్పడంతో అన్ని అంశాల్లో సినిమా ఆకట్టుకుంటుందని ముందుగానే హామీనిస్తున్నారు.
పెద్ది సినిమా విడుదల తేదీ..
పెద్ది చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా ఆర్ రత్నవేలు, ఎడిటర్ గా నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి, సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పనిచేస్తుండటం విశేషం. ఈ కారణంగా సినిమాకు భారీగానే ఖర్చు అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ రైట్స్ ను టీ-సిరీస్ సొంతం చేసుకోవడం విశేషం.
రామ్ చరణ్ నెక్ట్స్ మూవీస్..
పెద్ది చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ స్టార్ డేట్స్ కోసం టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, సుకుమార్, గౌతమ్ తిన్ననూరి, నిర్మాత దిల్ రాజ్ వెయిటింగ్ లో ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను రూపొందించేందుకు ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెక్ట్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











