‘గేమ్ ఛేంజర్’కు ఇక్కడే దెబ్బ..7 గంటలు.. శంకర్ గురించి పచ్చి నిజాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ భారీ ప్రాజెక్ట్స్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. చరణ్ తదుపరి చిత్రాల కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు, ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తన రాబోయే సినిమాలపై క్రేజీ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో తన చివరి సినిమా 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేశారు గేమ్ ఛేంజర్ మూవీ మాజీ ఎడిటర్ షమీర్.. ఆయన టాప్ డైరెక్టర్ అయిన ఎస్ శంకర్ పైనా తనకున్న అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా పంచుకున్నారు.. ఆ వివరాల్లోకి వెళితే..

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బడ్జెట్, నష్టం..
సౌత్ లో టాప్ డైరెక్టర్ ఎస్ శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం న'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఏకంగా రూ.400 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు. అయితే ఈ సినిమా 2021లో ప్రారంభమై 2024లో షూటింగ్ ను ముగించుకుంది. చరణ్ కెరీయర్ లోనే ఈ సినిమాకు చాలా సమయం వెచ్చించారు. ఏకంగా నాలుగేళ్ల పాటు సమయం కేటాయించారు. దర్శకుడు ఎస్ శంకర్ తన 'భారతీయుడు 2' సినిమా కోసం ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఏదేమైనా ఈ సినిమా ఈ ఏడాది జనవరి 10న ప్రేక్షకుల మందుకు వచ్చింది. కానీ డిజాస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ.220 కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు.

Ram Charan Game Changer movie Ex Editor Shocking comments about Director S Shankar

3.5 గంటల ఫుటేజీ వేస్ట్.?
గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తర్వాత భారీ విమర్శలను ఎదుర్కొంది. కేవలం రామ్ చరణ్ వల్లనే, ఆయనకు ఉన్న స్టార్ డమ్ వల్లనే అంతో ఇంతో వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.178 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేసింది. అయితే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలు ఉండింది. దీన్ని ట్రిమ్ చేసి 2 గంటల 31 నిమిషాలకు కుదించారు. అయితే మొత్తం ఫుటేజీ 7 గంటల 50 నిమిషాలు వచ్చిందంట.

ఈ విషయాన్ని గేమ్ ఛేంజర్ కు మాజీ ఎడిటర్ గా పనిచేసిన షమీర్ తాజాగా వెల్లడించారు. అంటే దాదాపు 3 సినిమాలకు కావాల్సిన ఫుటేజీ అన్న మాట. ఆ మొత్తం ఫుటేజీలో 3 గంటల ఫుటేజీని మాత్రమే తీసుకున్నారని, మిగిలినది వేస్ట్ అయ్యిందని చెప్పారు. శంకర్ తో పనిచేయడం ఏమాత్రం బాలేదని ఎడిటర్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన గేమ్ ఛేంజర్ చిత్రంతో దిల్ రాజ్ కు భారీగానే నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి.

రామ్ చరణ్ పైనే భారమంత..
మరోవైపు రామ్ చరణ్ కు కూడా సినిమా వల్ల వచ్చిన నెగెటివ్ రివ్యూస్ ఇబ్బందిని కలిగించాయి. మెసేజ్ ఓరియెంటెడ్ గా, భారీ విజువల్స్ తో వచ్చినా జనాలకు ఎందుకో ఎక్కలేదు. దాంతో సినిమా ఫెల్యూర్ భారమంతా చరణ్ పైనే పడింది. అయితే ఇటీవల మాత్రం శంకర్ వల్లనే సినిమా అనుకున్న స్థాయిలో రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య రైటర్ సుబ్బరాజ్ కూడా తను ఇచ్చిన కథ వేరు, వాళ్లు తీసింది వేరని చెప్పారు. ఇక తాజాగా ఎడిటర్ షమీర్ కూడా ఇలానే స్పందించడం హాట్ టాపిక్ గ్గా మారింది.

More from Filmibeat

Read more about: ram charan game changer peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X