Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త.. జరగండి సాంగ్ వచ్చేది ఆరోజే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనను.. గ్లోబల్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు. దాన్ని నిలుపుకోవడానికి రామ్ చరణ్ కూడా చాలానే కష్టపడుతున్నాడు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు.

అయితే ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ "జరగండి".. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాటను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ram Charan Game Changer Movie Jaragandi Song Coming Soon Check Details

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ పక్కన కియా కియారా అద్వానీ హీరోయన్ గా నటిస్తోంది. అలాగే అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ పనులు చూసుకుంటున్నారు. అలాగే షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకుల అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా తెగ ఎగ్జైట్ అయిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సూపర్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా 15 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన జరగండి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Ram Charan Game Changer Movie Jaragandi Song Coming Soon Check Details

ఇప్పటికే ఈ పాటను చాలా సార్లు విడుదల చేయబోతున్నారని టాక్ నడిచింది. కానీ పాటను మాత్రం రిలీజ్ చేయలేరు. కానీ ఈ సారి మాత్రం కన్ఫార్మ్ గా ఈ పాటను రిలీజ్ చేసి సినిమాపై బజ్ పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను తీసుకు రానున్నారు. చెర్రీ పుట్టిన రోజు మార్చి 27వ తేదీ. అంటే ఈ నెల 27నే గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి సాంగ్ విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X