RRR Release in Japan రాంచరణ్ క్రేజ్ జపాన్‌లో రచ్చ రచ్చ.. విందులు, గిఫ్టులతో కేక పెట్టించిన ఫ్యాన్స్
మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు జపాన్‌లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. RRR రిలీజ్‌కు ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాంచరణ్ తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి వెళ్లడం తెలిసిందే. జపాన్‌కు చేరుకొన్న రాంచరణ్ దంపతులకు భారీగా అభిమానులు స్వాగతం పలికారు. ప్రస్తుతం రాంచరణ్‌పై జపాన్ మహిళాభిమానులు కురిపిస్తున్న ప్రేమకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రేజ్ గురించిన వివరాల్లోకి వెళితే..

మగధీర మూవీతో రాంచరణ్‌కు
మగధీర చిత్రం జపాన్‌లో రాంచరణ్‌కు భారీ అభిమానులను సమకూర్చింది. అప్పటి నుంచి రాంచరణ్ ప్రతీ సినిమాకు వారి నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. మరోసారి RRR సినిమాతో తమ ముందుకు వస్తున్న మెగా పవర్ స్టార్‌ను ప్రేమగా ఆహ్వానించారు. రాంచరణ్‌కు జపాన్ అభిమానులు ఓ రెస్టారెంట్ మంచి విందును ఏర్పాటు చేయడం విశేషంగా మారింది.

జపాన్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ
జపాన్‌లో RRR సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రాంచరణ్‌కు స్థానిక అభిమానులు ప్రేమతో బహుమతులు ఇచ్చి అభిమానాన్ని చాటుకొన్నారు. కూకీ ప్యాకేజ్‌లు, సీడీలు, బ్రీవరేజ్ బాటిల్స్, టీ షర్టులు లాంటివి ఇచ్చి సత్కరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చెరుగని ముద్ర వేసి..
మగధీర నుంచి RRR సినిమాలతో జపాన్ ప్రేక్షకుల్లో చెరుగని ముద్ర వేశారనడానికి సాక్ష్యంగా తాజా అభిమానం నిలిచింది. సరిహద్దులు దాటిన అభిమాన వర్షంలో రాంచరణ్ తడిసి ముద్దవుతున్నాడు. ఇక RRR రిలీజ్ తర్వాత రాంచరణ్ అభిమానం ఆకాశాన్ని అంటడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.

రాంచరణ్ సినిమా పోస్టర్లతో
జపాన్‌లో వివిధ రకాల గెటప్స్‌తో ఉన్న రాంచరణ్ పోస్టర్ల ముందు అభిమానులు ఫోటోలు దిగుతూ ఆనందపడిపోతున్నాురు. అలాగే ఎవడు సినిమా పోస్టర్లు పట్టుకొని క్రేజీగా కనిపించారు. అలాగే రాంచరణ్ నటించిన సినిమా పోస్టర్లను గోడపై అలకరించి పండుగ చేసుకొన్నారు. ఇక మెగా పవర్ స్టార్ కటౌట్స్ పెట్టుకొని దండలు వేసి పూజలు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం RRR టీమ్‌లో ఉత్సాహాన్ని నింపింది.

నాటు నాటు పాట కోసం
ఇక RRR చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నాటు నాటు పాటకు వేసిన స్టెప్పుల కోసం జపాన్ ప్రేక్షకులు భారీగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్సాన్స్ లభించిన సంగతి తెలిసిందే. RRR తర్వాత ఇక జపాన్‌లో కూడా రచ్చ జరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

RRR అక్టోబర్ 21న రిలీజ్
జపాన్‌లో RRR చిత్రం అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్ నుంచి తన ఇద్దరు కొడుకులు, భార్యతో కలిసి జపాన్ చేరుకొన్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ జపాన్ పర్యటన వారం రోజులపాటు ఉండనున్నదని చిత్ర యూనిట్ తెలిపింది.


Click it and Unblock the Notifications











