twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ram Charan మెగా పవర్ స్టార్‌కు True Legend అవార్డు.. ఎమోషనల్ స్పీచ్ వైరల్

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. జాతీయ స్థాయిలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఎన్డీటీవీ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా (Future of Young India) అవార్డును సొంతం చేసుకొన్నారు. ఈ అవార్డు కార్యక్రమంలో ట్రూ లెజెండ్ (True Legend) అవార్డుతో రాంచరణ్ సత్కరించారు.

    Ram Charan

    అవార్డు అందుకొన్న అనంతరం రాంచరణ్ ఎమోషనల్‌గా మాట్లాడాడు. తన తండ్రి బ్లడ్ బ్యాంక్ పెట్టడం వెనుక విషయాన్ని పంచుకొంటూ.. 1997లో మా ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫ్రెండ్.. సకాలంలో రక్తం లభించకపోవడంతో మరణించారు. 20 శతాబ్దంలో కూడా రక్తం లభించకుండా ఓ వ్యక్తి మరణించడమా? అనే దిగ్బ్రాంతికి గురయ్యాం అని రాంచరణ్ ఎమోషనల్ అయ్యారు.

    ఆ ఘటన తర్వాత నా తండ్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చొరవ తీసుకొన్నారు. తనపై ప్రేమను చూపించే అభిమానుల సహకారంతో 1998లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఎవరైనా తనతో ఫోటో తీయించుకోవాలంటే.. సొసైటీ కోసం రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి రక్తదానం చేసిన ప్రతీ అభిమానితో ఫోటో దిగే కార్యక్రమాన్ని చెపట్టారు అని ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును స్వీకరించిన తర్వాత చెప్పారు.

    ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును స్వీకరించిన నేపథ్యంలో రాంచరణ్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసి అభినందించారు. నిన్ను చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అంతేకాకుండా ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకొన్న తర్వాత నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇంకా ఇలాంటి అవార్డులు మరిన్నీ సాధించాలి అంటూ చిరంజీవి ఆకాంక్షించారు.

    ఇక రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా పలు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

    English summary
    Mega Power Star Ram Charan gets True Legend award of NDTV. Prestigious Channell's Future Of Young India Award for Mega Power Star.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X