For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు

By Manoj
|

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తెలుగు సినీ ఇండస్టీలోని స్టార్ హీరోలలో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకూ వేరియేషన్ చూపించాలని తాపత్రయ పడుతుంటాడు. అంతేకాదు, సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా సులభంగా పూర్తి చేస్తాడు. ఇదంతా ఒకవైపు మాత్రమే. ఆయనలో మరో యాంగిల్ కూడా ఉంది. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సొంత ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్నాడు. ఇటీవలే తన తండ్రితో ఓ సినిమాను కూడా నిర్మించాడు. తాజాగా రామ్ చరణ్ ఓ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ మంచి పని చేసి అందరి హృదయాలను కొల్లగొట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తన తండ్రి కోసం రిస్క్ చేశాడు

తన తండ్రి కోసం రిస్క్ చేశాడు

ఇటీవల రామ్ చరణ్.. తన తండ్రి కోసం ఓ రిస్క్ చేశాడు. అదే.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సైరా: నరసింహారెడ్డి' సినిమా. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన చరణ్ భారీగా ఖర్చు చేశాడు. కానీ, ఈ సినిమాకు అయిన బడ్జెట్ కంటే తక్కువ కలెక్షన్లు వచ్చాయి. టాక్ మాత్రం అనుకూలంగానే రావడం విశేషం.

మరో ప్రతిష్టాత్మక చిత్రంతో వస్తున్నాడు

మరో ప్రతిష్టాత్మక చిత్రంతో వస్తున్నాడు

ఈ ఏడాది నిర్మాతగా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమా జూలై 30, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది ‘రంగస్థలం' అనే సినిమాలో నటించాడు. దీన్ని సుకుమార్ తెరకెక్కించాడు. 1980 దశకం నాటి కథతో రూపొందిన ఈ సినిమాలో చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ సినిమాకు గానూ అతడు ‘బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్'ను దక్కించుకున్నాడు. చెన్నైలో జరిగిన ఏడో ఎడిషన్‌లో ఈ అవార్డు అందుకున్నాడు.

ఆయనకు అంకితం ఇచ్చేశాడు

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అందించే ఈ అవార్డుల ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ద పీపుల్ ఎంటర్‌టైనర్ అవార్డు అందుకున్న రామ్ చరణ్.. దానిని ఇటీవల మరణించిన మెగా అభిమాని, చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌కు అంకితం ఇచ్చాడు. దీంతో అందరూ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
అక్కడి నుంచే సాయం ప్రకటించాడు

అక్కడి నుంచే సాయం ప్రకటించాడు

నూర్ మృతి చెందిన సమయంలో రామ్ చరణ్ చెన్నైలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అతడు ఫేస్‌బుక్ ద్వారా సంతాపం తెలియజేశాడు. అలాగే, సోమవారం రామ్ చరణ్.. అభిమాని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే, రూ 10 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించాడు. హైదరాబాద్ వచ్చిన వెంటనే కుటుంబాన్ని కలుస్తానని చెప్పుకొచ్చాడు.

English summary
The 7th Behindwoods Gold Medal Awards was held in all grandeur on the 8th of December 2019. The star-studded event was attended by many dignitaries from different walks of life. The memorable night became more special as talented artists were recognized and honored. Here's the list of the Awardees of the 7th Behindwoods Gold Medals.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more