For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి బాధ్యతను తీసుకున్న చరణ్.. ఆమె కోసం రంగంలోకి దిగిన మెగా హీరో

  |

  గతంలో పోలిస్తే కొంత కాలంగా తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచిలో చాలా తేడా కనిపిస్తోంది. అందుకే ప్రయోగాత్మకంగా తీస్తున్న చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ అందిస్తున్నారు. దీంతో ఓ మూస ధోరణిలో సాగుతూ వచ్చిన టాలీవుడ్ సినిమాలు.. సరికొత్త పంథా వస్తున్నాయి. ఇందులో భాగంగానే రీమేక్‌లు, సీక్వెల్స్‌, మల్టీస్టారర్ మూవీలు ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు తెరకెక్కుతోన్నాయి. అదే సమయంలో క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు కూడా బాగానే రూపొందుతున్నాయి. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. వాటిలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

  హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

  మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో షూటింగ్ నేపథ్యంలో రాబోతున్న చిత్రమే 'గుడ్ లక్ సఖి'. నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. కానీ, ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావం పెరిగిన కారణంగా షూటింగ్‌కు పలుమార్లు బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. దీంతో ఈ సినిమా ఆగిపోతుందేమోనన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ స్పందిస్తూ ఈ సినిమా త్వరలోనే విడుదల అవుతుందని తెలిపింది.

  Ram Charan grace the Good Luck Sakhi Event

  తెలుగులో తొలి షూటింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న 'గుడ్ లక్ సఖి' మూవీ షూటింగ్‌ను ఇటీవలే పున: ప్రారంభించి శరవేగంగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక, ఈ చిత్రాన్ని జనవరి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం వేగవంతం చేసేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సినిమా టీజర్, పాటలను విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఈ క్రమంలోనే ఇటీవలే 'గుడ్ లక్ సఖి' మూవీ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేయగా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

  మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ

  'గుడ్ లక్ సఖి' మరో రెండు రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో 26వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌తో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. వాస్తవానికి ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా రావాల్సింది. కానీ, ఆయనకు గత రాత్రి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌ను దీనికి ఆహ్వానించగా.. అతడు ఓకే చెప్పేశాడు.

  పల్లెటూరి అమ్మాయి ప్రపంచ స్థాయి షూటర్‌గా ఎలా ఎదిగింది అనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే 'గుడ్ లక్ సఖి'. ఇక, ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీన్ని దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది జనవరి 28న విడుదల కాబోతుంది.

  English summary
  Tollywood Star Heroine Keerthy Suresh Now Doing Good Luck Sakhi Under Nagesh Kukunoor Direction. Ram Charan grace the Good This Movie Pre Release Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X