‘ఉప్పెన’ సక్సెస్ సెలెబ్రేషన్స్.. రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనంగా మారింది. ఓ డెబ్యూ హీరో, హీరోయిన్, డైరెక్టర్‌లకు ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ రావడం వసూళ్ల సునామిగా ఉప్పెన దూసుకెళ్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఉప్పెన వసూళ్ల లెక్కలు ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేస్తున్నాయి. మొదటి వారాంతంలోనే ఉప్పెన లాభాల బాట పట్టేసింది. బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.
ఇప్పటికే దాదాపు 30 కోట్ల షేర్‌ను క్రాస్ చేసింది. దాదాపు 60 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలా ఉప్పెన సినిమా విజయపథంలో దూసుకుపోతుండగా.. సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను స్పెషల్ గెస్ట్‌గా తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన చేశారు. ఇందులో వేదిక, సమయం అన్నింటిని ప్రకటించారు.

ఫిబ్రవరి 17న సాయంత్రం ఆరు గంటలకు ఉప్పెన సక్సెస్ వేడుకలను రాజమండ్రిలో నిర్వహిస్తున్నామని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా రాబోతోన్నాడని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఉప్పెన సినిమాతో ముగ్గురి కెరీర్ నిలబెట్టేసింది. అటు హీరోగా వైష్ణవ్, ఇటు హీరోయిన్‌గా కృతి శెట్టి ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇక బుచ్చిబాబుపై స్టార్ హీరోలపై కన్ను పడినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











