మాల్దీవుల్లో ఉపాసన.. ఐ లవ్ యూ రామ్.. ప్రత్యేకమైన రోజు అంటూ!
మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన కుటుంబ, వ్యక్తిగత విషయాలను మెగా అభిమానులకు చేర్చడంలో ఉపాసన ముందుంటుంది. ఇంకా చెర్రీ, ఉపాసన వేసే హాలిడే ట్రిప్స్ తాలూకు విషయాలైతే ప్రతీ క్షణం అప్‌డేట్ చేస్తుంటుంది ఉపాసన.
తమ తమ పనులతో బిజీగా ఉంటూనే కాస్త విరామం దొరికితే చాలు చెర్రీ- ఉపాసన జాలీ జాలీ షికార్లు కొడుతుంటారు. ఇటీవలే వీరి మ్యారేజ్ డే పురస్కరించుకొని ప్రీ వెడ్డింగ్ అంటూ ఆఫ్రికాలో షికారు చేసిన ఈ జంట.. అదే స్టైల్ లో ఉపాసన బర్త్ డేని ప్లాన్ చేశారు. జులై 20 వ తేదీన ఉపాసన బర్త్ డే సందర్బంగా మాల్దీవులకు వెళ్లారు ఉపాసన- రామ్ చరణ్. మాల్దీవుల్లోని అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఉపాసన.. రామ్ చరణ్ పై ప్రేమను కురిపిస్తూ ట్వీట్ చేసింది. ''ఐ లవ్ యూ రామ్ చరణ్.. నీతో ఉన్న ప్రతీ రోజు ఓ ప్రత్యేకమైన రోజుగా మలుస్తున్నందుకు కృతజ్ఞతలు. నీ ప్రేమ, దయాగుణం నాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. నా పుట్టిన రోజును ఇలా ప్లాన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొంది ఉపాసన. ఈ మేరకు చెర్రీతో కలిసి మాల్దీవుల్లోని స్టీమర్ పై చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నప్పటి పిక్ షేర్ చేసింది.

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











