భార్యతో కలిసి ఆఫ్రికా వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాలికి గాయం కావడంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చరణ్ గాయం కారణంగా 'RRR' మూవీ షూటింగ్ సైతం నిలిపి వేశారు. కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన చెర్రీ... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
'RRR' మూవీ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చరణ్ సిద్ధమవుతున్నారని సమాచారం. తన షూటింగ్ మొదలు కావడానికి కొంత సమయం ఉండటంతో ఆఫ్రికా వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం చరణ్, ఉపాసన ప్రస్తుతం టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్కులొ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారట. ఈ పార్క్ వైల్డ్ యానిమల్స్.. ముఖ్యంగా జీబ్రాలకు ప్రసిద్ధి.
ఆఫ్రికా వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే చరణ్ 'RRR' మూవీ షూటింగులో జాయిన్ అవుతారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి నిర్ణయించారు. ఒక వేళ అనుకున్న సమయానికి షూట్ పూర్తికాపోతే జనవరి 2020లో కూడా ఈ ఇద్దరితో షూటింగ్ జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు. 1920 కాలం నాటి బ్రిటిష్ బ్యాక్ డ్రాపుతో ఫిక్షన్ స్టోరీతో ఈ చిత్రం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా కావడంతో అజయ్ దేవగన్, సముద్రఖని లాంటి ఇతర భాషా నటులను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 30, 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











