ఆ రూమర్స్ నిజం కాదట.. చిట్టిబాబుతో రామ్ చరణ్ సెటైర్!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ ఏ స్థాయిలో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక హీరో సినిమా స్టార్ట్ చేయకముందే ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ కథనలు వైరల్ అవుతుంటాయి. సినిమా మొదలయ్యే వరకు వాటిలో ఏది నిజం అనేది తెలియదు. పైగా అభిమానులల్లో అనేక రకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతుంటాయి.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన రూమర్స్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై కొన్ని రూమర్స్ అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. నెక్స్ట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే కాకుండా వెంకీ కుడుముల వంటి దర్శకులతో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది.

అలాగే వంశీ దర్శకత్వంలో చేసే సినిమాకు మహేష్ బాబు నిర్మాత అనే టాక్ కూడా వచ్చింది. అయితే ఆ రూమర్స్ పై ఈ మెగా హీరో ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసినట్లు తెలుస్తోంది. "విశ్వసనీయ సమాచారాలు మాత్రమే వినాలి" అంటూ ఇన్స్టాగ్రామ్ లో రంగస్థలంలోని చిట్టిబాబు ఫోటో కూడా పోస్ట్ చేశాడు చరణ్. దీంతో ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నప్పటికి చరణ్ మాత్రం నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన రూమర్స్ పైనే క్లారిటీ ఇచ్చాడని మెగా సన్నిహితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











