Ram Charan: సినిమాల్లోకి పవన్ వారసుడు .. అకీరా ఎంట్రీపై రామ్ చరణ్ క్లారిటీ!

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ అయిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా గతంలో ఒప్పుకున్న సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే..ఆ సినిమాలు కంప్లీట్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేశారా? లేదా? అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ పవన్ రాజకీయాల్లోనే ఫిక్స్ అయిపోతే.. తన తనయుడు అకిరా నందన్ ను సినీ ఎంట్రీ ఇస్తే.. బాగుంటుందని మెగా ఫ్యాన్స్ డిమాండ్. ఈ తరుణంలో అకిరా సినీ ఎంట్రీ పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ తన తమ్ముడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై రామ్ చరణ్ ఏమన్నారంటే?

గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా మారిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా గతంలో ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఓజీ సినిమా షూటింగ్లో పవన్ పాల్గొంటూ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే 'హరివీరమల్లు' సినిమాను షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేయబోతున్నట్లు టాక్. ఇలా సుజిత్ ఓజీ, ఉస్తాద్ గబ్బర్ సింగ్, హరి హర వీర మల్లు సినిమాలు కంప్లీట్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలో నటిస్తారా? లేదా ? అనేది సందేహంగా ఉంది.

Ram Charan Interesting Comments On Pawan Kalyan son Akira Nandan Tollywood Entry in Balakrishna Unstoppable show

ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోనే పూర్తిగా నిమగ్నమైతే.. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినీ ఎంట్రీ ఇస్తే.. బాగుంటుందనీ మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే అకీరా సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అకీరా సినిమా ఎంట్రీ ఇవ్వడానికి
అన్ని విధాలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు రాక కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే .. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓజి' సినిమాలో ఆకీరా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన మాత్రం రాలేదు.

ఇటీవల యాక్టర్ అండ డైరెక్టర్ SJ సూర్య కూడా అకీరా ఎంట్రీ పై స్పందించారు. అకిరా నందన్‌తో ఖుషి 2 ఏమైనా ప్లాన్ చేస్తారా? అని ప్రశ్నించగా.. తాను అకీరాను రాజమండ్రిలో కలిశాననీ, అతడిని ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారి లాగానే.. అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అకిరా నంద‌న్‌తో ఖుషి సీక్వెల్ వ‌ర్క‌వుట్ చేస్తాననీ ఎస్‌జే సూర్య తెలిపారు. వాస్తవానికి ఖుషీ 2 స్టోరీని పవన్ కళ్యాణ్ తో డిస్కషన్స్ జరిగిందనీ, కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదనీ అన్నారు.

Ram Charan Interesting Comments On Pawan Kalyan son Akira Nandan Tollywood Entry in Balakrishna Unstoppable show

తాజాగా అకీరా నందన్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ అకీరా నందన్ సినిమా ఎంట్రీ పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓ భారీ బడ్జెట్ మూవీ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెస్తోంది. . అలాగే అకిరానందంతో తనకు ఉన్న అనుబంధాన్ని రామ్ చరణ్ పంచుకున్నాడు. ఇతరులలో తన బాబాయ్ గొప్పదనం గురించి తలుపు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా రాంచరణ్ చేశారు.‌ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X