అందుకే చిరు-కొరటాల మూవీ షెడ్యూల్ క్యాన్సిల్.. ఆ గొప్ప నిర్ణయాన్ని సెలెబ్రేట్ చేస్తున్నాము

మెగాస్టార్ చిరంజీవి అల్లు వారింటి అమ్మాయి సురేఖను పెళ్లి చేసుకుంది ఈ రోజే. నేటికి సరిగ్గా వారికి వివాహమై.. 40 ఏళ్లు అవుతుంది. 1980 ఫిబ్రవరి 20న వీరిద్దరికి వివాహమైంది. ఫిబ్రవరి 18న సురేఖ పుట్టిన రోజును మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. చిన్న కూతురు శ్రీజ కుటుంబంతో సహా వచ్చి విష్ చేసింది. రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ మహెత్సవం..

తాజాగా చిరు-సురేఖ వివాహ మహోత్సవాన్ని కూడా బాగానే సెలెబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. వారిద్దరు తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని మేము సెలెబ్రేట్ చేస్తున్నామని హ్యాపీ యానివర్సరీ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. పలు సందర్భాల్లో దిగిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అందుకే వాయిదా..

అందుకే వాయిదా..

ఫిబ్రవరి 18న పుట్టిన రోజు, ఫిబ్రవరి 20న వివాహ వార్షికోత్సవాన్ని సెలెబ్రేట్ చేసేందుకే కొరటాల శివతో చేస్తోన్న సినిమా షెడ్యూల్‌ను రామ్ చరణ్ వాయిదా వేయించాడట. లేదంటే.. ఫిబ్రవరి 16 తేదీ నుంచి పోలవరం పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేసేవారని తెలుస్తోంది.

ఇప్పటికే ఓ పాట..

ఇప్పటికే ఓ పాట..

ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ.. కొరటాలతో చేస్తోన్న మూవీ గురించి అప్‌డేట్ ఇచ్చేశాడు. ఇప్పటికే ఓ పాటను, మూడు యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసినట్టు తెలిపాడు. మళ్లీ నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతోందో చూడాలి.

Recommended Video

RRR First Look : The Best Fan Made Posters | RRR Poster Review | JR NTR | Ram Charan
ఆచార్య అంటూ వైరల్..

ఆచార్య అంటూ వైరల్..

చిరు-కొరటాల మూవీ టైటిల్ ఇదేనంటూ నిత్యం ఏదో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో గోవింద ఆచార్య అని రాగా.. ప్రస్తుతం ఆచార్యకే ఫిక్స్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక మూవీ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని టాక్ రాగా.. ఆ పాత్ర కోసం మహేష్ బాబును సంప్రదించారని వార్తలు వైరల్ అయ్యాయి. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X