మాటిచ్చాను తారక్.. తప్పకుండా బెస్ట్ ఇస్తాను: RRR హీరోల పవర్ఫుల్ కామెంట్స్

మొత్తానికి అతిపెద్ద బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కూడా కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా సోమవారం షూటింగ్ తో మళ్ళీ సరికొత్తగా మొదలైంది. ఇక బ్యాక్ టూ షూట్ అంటూ విడుదల చేసిన స్పెషల్ మేకింగ్ వీడియో కూడా ఆడియేన్స్ ని సరికొత్తగా ఆకట్టుకుంది. ఇక షూటింగ్ సిద్ధమైన హీరోలు సోషల్ మీడియా ద్వారా వారి వివరణ ఇచ్చారు.

Recommended Video

RRR Is Back In Action, Makers Announce #RAMARAJUFORBHEEM On October 22 | Oneindia Telugu
కరోనా వల్ల ఆగిపోవడంతో..

కరోనా వల్ల ఆగిపోవడంతో..

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మార్చ్ 27న RRR అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఒక విధంగా రామ్ చరణ్ కి అద్భుతమైన బహుమతి ఇచ్చాడనే చెప్పాలి. ఇక అదే తరహాలో రామ్ చరణ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న కొమురం భీమ్ లుక్ ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల అది కుదరలేదు.

నీకు ప్రామిస్ చేశాను.. రామ్ చరణ్

నీకు ప్రామిస్ చేశాను.. రామ్ చరణ్

ఆరు నేలేల తరువాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ జూనియర్ ఎన్టీఆర్ టీజర్ ని సిద్ధం చేస్తోంది. ఇక రామ్ చరణ్ స్పందిస్తూ.. మై డియర్ బ్రదర్ తారక్ చాలా రోజుల నుంచి ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను. అది చాలా అలస్యమయ్యింది. నీకు ప్రామిస్ చేశాను. తప్పకుండా అక్టోబర్ 22న బెస్ట్ ఇవ్వగలను.. అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేసిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇక నేను వెయిట్ చేయలేను: జూనియర్ ఎన్టీఆర్

ఇక నేను వెయిట్ చేయలేను: జూనియర్ ఎన్టీఆర్

ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోదర భావంతో చేసిన మరో ట్వీట్ కూడా ఇరు వర్గాల అభిమానులను మంచి కిక్కిస్తోంది. సెట్లోకి మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము జక్కన్న.. రామ్ చరణ్ బ్రో మొత్తానికి కలిశాము. ఇక నేను వేచి ఉండలేను అంటూ.. రామారాజు, భీమ్ కోసం రాబోతున్నాడు.. అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు తారక్.

ఫైనల్ గా రాజమౌళి ఏమన్నారంటే..

ఫైనల్ గా రాజమౌళి ఏమన్నారంటే..

ఇక దర్శకుడు రాజమౌళి ఏకంగా కరోనా వైరస్ ను జయించి మరోసారి ధీటుగా నిలబడుతున్నాడు. ట్విట్టర్ లో ఆయన ఈ విధంగా స్పందించారు. జీవితం ఇప్పటికే కొంచెం కొత్తగా నార్మల్ గా మారింది. దానికి అనుగుణంగా మనం ముందుకు సాగాలి. కాబట్టి మా షూట్ తిరిగి స్టార్ట్ అవుతోంది.. అని రాజమౌళి పేర్కొన్నారు. చూస్తుంటే చిత్ర యూనిట్ అక్టోబర్ 22న కొమురం భీమ్ టీజర్ తో అదిరిపోయే కిక్ ఇస్తుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా గుఱ్ఱంపై రామ్ చరణ్ బుల్లెట్ పై తారక్.. ఆ హై వోల్టేజ్ ఫ్రేమ్ కోసమే ఆడియేన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X