2 Years of RRR తారక్ చాలాసార్లు భార్యను వదిలేసి నా వద్దకు.. ఆటపట్టించిన రాంచరణ్!

దర్శక ధీర ఎస్ఎస్ రాజమౌళి, గ్లోబల్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. 2022 సంవత్సరంలో మార్చి 24వ తేదీన రిలీజైన ఈ చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రాజమౌళి, రాంచరణ్ ముగ్గురు కలిసి సెలబ్రేట్ చేసుకొన్నారు. ఈ సెలబ్రేషన్‌లో వారి కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకొన్నారు. RRR సినిమా వివరాలు, కలెక్షన్లు, 2 Years fo RRR సెలబ్రేషన్ వివరాల్లోకి వెళితే..

జక్కన్న, మెగా పవర్ స్టార్, యంగటైగర్ ముగ్గురు కలిసి RRR రెండేళ్లు పూర్తి చేసుకొన్న సంఘటనను పండుగలా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మార్చి 27 రాంచరణ్ జన్మదినం పురస్కరించుకొని ముందస్తుగా కూడా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు అప్యాయంగా తినిపించుకొన్నారు. ముగ్గురు కౌగిలించుకొని స్టెప్పులు వేసిన వీడియో ట్రెండ్ అవుతున్నది.

Ram Charan Jr NTR SS Rajamouli Celebrated 2 years of RRR Here Mega Powser Star Birthday Event

ఇక రాంచరణ్ బర్త్ డే వేడుకను ఫన్నీగా ముగ్గురు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను చెర్రీ ఆటపట్టించారు. అంతేకాకుండా మాట్లాడుతూ.. తారక్ చాలా సార్లు ధైర్యం తెచ్చుకొని భార్య లేకుండా నా వద్దకు వచ్చాడు. దానికి ప్రణీతకు థ్యాంక్స్ చెప్పాలా? లేదా ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెప్పాలా అర్ధం కావడం లేదు అని రాంచరణ్ అన్నాడు. దాంతో ఎన్టీఆర్, రాజమౌళి నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Ram Charan Jr NTR SS Rajamouli Celebrated 2 years of RRR Here Mega Powser Star Birthday Event

ఇక RRR సినిమా వివరాల్లోకి వెళితే.. ఈ మూవీని 550 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 14 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. బాహుబలి తర్వాత 1000 కోట్లు వసూలు చేసిన రెండో సినిమాగా రాజమౌళి కెరీర్‌లో రికార్డు అందుకొన్నది.

ఇక RRR సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఆంధ్రా, నైజాంలో 403 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 80 కోట్ల రూపాయలు, తమిళనాడులో 80 కోట్ల రూపాయలు, కేరళలో 25 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 335 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 45 మిలియన్ డాలర్లు అంటే.. 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 1400 కోట్ల రూపాయలకు చేరువగా వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X