ఫ్యాన్స్ కు రామ్ చరణ్ స్పెషల్ నోట్.. వీడియో కూడా రిలీజ్ !

కోవిడ్ -19 మహమ్మారి కాలంలో మెగా అభిమానులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్న సంగతి తెలిసిందే. వారికి ఉన్నంతలో వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తున్నారు. ఒకపక్క మెగా కుటుంబం కూడా అవసరమైన వారికి అనేక రకాలుగా సహాయపడుతూ ఇప్పటికే రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పి అనేక విధాలుగా సహాయ పడుతున్నారు. ఆక్సిజన్ కావాలి అనుకున్న వారికి సహాయం అడిగితే వెంటనే పంపించి సాయం చేస్తున్నారు.

ఇక తాజాగా మెగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. వారి కోసం ఒక స్పెషల్ నోట్ విడుదల చేయడమే కాక మరో స్పెషల్ వీడియో కూడా రామ్ చరణ్ తేజ విడుదల చేశారు. అభిమానులు ఈ కరోనా మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను అని ఆయన అన్నారు.

Ram Charan konidela thanks fans for their charity during corona pandemic

అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యునికి సహాయం చేయడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకితభావంతో పని చేశారని ఆయన అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరుపేరునా నా శుభాభినందనలు అని పేర్కొన్నారు. మీ అందరికీ అంకితభావానికి నా ధన్యవాదాలు అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అలాగే తన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను ఒక వీడియో రూపంలో కూడా ఆయన విడుదల చేశారు. ఇక చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు బాధ్యతలు కూడా రామ్ చరణ్ తలకెత్తుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X