ఆచార్య టీమ్‌తో కలిసిన రామ్ చరణ్.. స్పెషల్ లుక్ రిలీజ్.. ఎలాంటి పాత్ర చేస్తున్నాడంటే..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ చాలా రోజుల తరువాత సినిమా షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఇటీవల కరోనా భారిన పడిన రామ్ చరణ్ షూటింగ్స్ కు కొంత బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి కోవిడ్ నుంచి కోలుకున్న మెగా పవర్ స్టార్ తన రెగ్యులర్ సినిమాలతో బిజీ అయ్యాడు. ఇక ఆచార్యకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. ఒక స్పెషల్ లుక్ కూడా వదిలారు.

ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

 స్పీడ్ పెంచిన కొరటాల

స్పీడ్ పెంచిన కొరటాల

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ సినిమాపై అంచనాలు అకాశాన్ని తాకుతున్నాయి. ఇక మేలో రానున్న ఈ సినిమా యొక్క షూటింగ్ పనులను కూడా చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు.

రామ్ చరణ్.. సిద్దా పాత్రలో

రామ్ చరణ్.. సిద్దా పాత్రలో

ఫైనల్ గా రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక స్పెషల్ లుక్ ను విడుదల చేశారు. రామ్ చరణ్ వెనకాల నుంచి ఫేస్ సైడ్ వ్యూవ్ కనిపించేలా ఫొటోను వదిలారు. ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెంటిమెంట్ డేట్

సెంటిమెంట్ డేట్

ఇక ఈ సినిమా మెగాస్టార్ సెంటిమెంట్ రోజు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన రూమర్స్ అయితే చాలానే వైరల్ అవుతున్నాయి. ఇక మెగాస్టార్ కెరీర్ లో మరచిపోలేని తేదీలలో మే 9 ఒకటి. 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ తరువాత 1991లో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అదే రోజున వచ్చింది. ఆ రెండు సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

రిలీజ్ ఎప్పుడంటే..

రిలీజ్ ఎప్పుడంటే..

ఇక చాలా కాలం తరువాత మెగాస్టార్ కన్ను మళ్ళీ ఆ డేట్ పైనే పడినట్లు తెలుస్తోంది. మే9న ఆచార్య విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ ఫిక్స్ అయితే ఆ దరిదాపుల్లో వారి సినిమాలను రిలీజ్ చేయవద్దని అనుకుంటున్నారు. మరి ఆచార్య సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X