Bedurulanka 2012 Trailer: యుగాంతం కథతో 'బెదురులంక 2012'.. రామ్ చరణ్ ఏమన్నాడంటే?

RX100 సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ గుమ్మకొండ. అయితే ఈ సినిమా తర్వాత కార్తికేయ నటించిన సినిమాలు ఏవి ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. అయితే హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఆకట్టుకున్నాడు కార్తికేయ ఇప్పుడు మరోసారి హీరోగా అలరించేందుకు రెడీ అయ్యాడు. కార్తికేయ, డీజే టిల్లు బ్యూటి నేహాశెట్టి జోడీ కట్టిన సినిమా బెదురులంక 2012. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. బెదురులంక 2012 ట్రైలర్ (Bedurulanka 2012 Trailer) విశేషాల్లోకి వెళితే..

కొత్త దర్శకుడు:RX100 సినిమాతో కార్తికేయ.. డీజే టిల్లు మూవీతో నేహా శెట్టి తెలుగులో యమ క్రేజ్ సంపాదించుకున్నారు. తొలిసారిగా వీరిద్దరు జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012 (Bedurulanka 2012). లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ముప్పానేని రవీంద్ర బెనర్జీ (బెన్నీ) నిర్మిస్తున్న ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సి. యువరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

Ram Charan Launched Kartikeya Bedurulanka 2012 Trailer

ప్రళయం వస్తుందని:డిసెంబర్ 21, 2012 ప్రపంచమంతా యుగాంతం వస్తుందని, ప్రళయం వస్తుందని భయపడిన రోజు. కానీ ఎక్కడా ఏం జరగలా. ఒక్క మా ఊర్లో తప్పా అంటూ అజయ్ ఘోష్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. బెదురులంక గ్రామంలో యుగాంతం వస్తుందనే భయాన్ని వాడుకుని కొంతమంది ఎలా క్యాష్ చేసుకున్నారో కథగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. ట్రైలర్ లో కామెడీ, రొమాన్స్, లవ్ ట్రాక్, సస్పెన్స్ వంటి అంశాలు అన్ని బాగున్నట్లు తెలుస్తోంది.

Ram Charan Launched Kartikeya Bedurulanka 2012 Trailer

ఆకట్టుకునేలా డైలాగ్స్:మెలోడీ బ్రహ్మా అందించిన నేపథ్య సంగీతం కూడా బాగుంది. కార్తికేయ, నేహా శెట్టి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 'మీరేమైనా సిగరెట్ కొనిచ్చారా. పోతే నా లంగ్స్ పోతాయ్', 'ఒక్కసారి వాన్నే ఐ లవ్యూ అని చెప్పమనవే. నేను యస్ అని చేయి ఎత్తేస్తా', 'సాక్షాత్తు శ్రీవిష్ణువే మూడు అవతారాలు ఎత్తి యుగాంతాన్ని ఆపలేకపోయినప్పుడు ఈ బ్రహ్మం, ఆ డేనియర్ కలిసి ఆపేస్తానంటే మీరు ఎలా నమ్మారండి', 'నేను నమ్మనివాటిని చేయని. అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఇగో కాదు' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

రామ్ చరణ్ స్పీచ్:బెదురులంక 2012 ట్రైలర్ విడుదల సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. "కార్తికేయ, నేహాశెట్టి జంట చాలా బాగుంది. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. బెదురులంక 2012 ట్రైలర్, ఇందులో చెప్పిన కథ చాలా బాగుంది. అజయ్ ఘోష్ గారి పాత్ర వచ్చినప్పటినుంచి ఇంకా బాగుంది. సంగీతం కూడా చాలా కొత్తగా అనిపించింది. ఆర్ఎక్స్ 100 సెన్సేషనల్ హిట్ అయింది. కార్తికేయ కొత్త కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

నటీనటులు:ఇక ట్రైలర్ చివర్లో ద శివశంకర వరప్రసాద్ షో బిగిన్స్ అంటూ చిరంజీవి పేరును కార్తికేయ ఎత్తడం హైలెట్ గా నిలిచింది. మొదటి నుంచి కార్తికేయ మెగాస్టార్ చిరంజీవి అభిమాని అని తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే బెదురులంక 2012 సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, అటో రామ్ ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, సత్య, అనితా నాథ్, దివ్య నార్ని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X