మెగా అభిమానులకు చేదు వార్త.. రామ్ చరణ్ మూవీ రిలీజ్ క్యాన్సిల్

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికితోడు రెండో మూవీ 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకుని.. రేంజ్‌ను అమాంతం పెంచుకున్నాడు. పూర్వ జన్మల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా రూ. 45 కోట్లు బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాకు ఫుల్ రన్‌లో ఏకంగా రూ. 73.78 కోట్లు షేర్ వసూలు అయింది. దీంతో ఈ చిత్రానికి రూ. 28.78 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. తద్వారా ఇది ఇండస్ట్రీ హిట్‌ అయింది.

ఈ మధ్య కాలంలో తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది స్టార్లకు సంబంధించిన క్లాసిక్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'మగధీర' మూవీ రీ రిలీజ్‌ను ఏర్పాటు చేసినట్లు ఇటీవలే నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లొకేషన్లలో ప్రదర్శించబోతున్నట్లు కూడా వెల్లడించింది.

 Ram Charan Magadheera Movie Re Release Cancelled

రామ్ చరణ్‌ను బడా స్టార్‌ను చేసిన 'మగధీర' రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో 'టెక్నికల్ కారణాల వల్ల సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మగధీర సినిమా రి రిలీజ్‌ను క్యాన్సిల్ చేస్తున్నాము. మేము మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డేకు మంచి ట్రీట్ ఇవ్వాలనుకున్నాము. ఇక, మంచి రోజు చూసుకుని మగధీరను మరోసారి మీ ముందుకు తీసుకు వస్తామని ఆశిస్తున్నాము' అని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' మూవీని మార్చి 25, 26 తేదీల్లో స్పెషల్ షోలు వేస్తున్నట్లు నిర్మాత నాగేంద్ర బాబు ప్రకటించారు. అంతేకాదు, ఆ డబ్బును పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X