Magadheera: మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. వచ్చే నెలలోనే చరణ్ సినిమా రిలీజ్
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో పాత సినిమాల స్పెషల్ షోలు, రీ రిలీజ్‌లు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు 4K ప్రింట్లతో ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. వీటన్నింటికీ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ నుంచే కాకుండా సామాన్య సినీ ప్రియుల నుంచి కూడా ఆదరణ దక్కింది. దీంతో మళ్లీ ప్రదర్శితం అయినా కూడా చాలా చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది. తాజాగా అతడి అభిమానులు పండుగ చేసుకునే ప్రకటన వచ్చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'మగధీర' మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు, ఇది అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడంతో పాటు రాజమౌళి స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లొకేషన్లలో ప్రదర్శించబోతున్నట్లు గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా మొదలు కాబోతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'మగధీర' మూవీలో రామ్ చరణ్ హీరోగా నటించాడు. పూర్వ జన్మల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా రూ. 45 కోట్లు బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాకు ఫుల్ రన్‌లో ఏకంగా రూ. 73.78 కోట్లు షేర్ వసూలు అయింది. దీంతో ఈ చిత్రానికి రూ. 28.78 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. తద్వారా ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక, ఇప్పుడు కూడా ఇది మంచి రెస్పాన్స్‌ను అందుకునే అవకాశం ఉందనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. దీనితో పాటు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనతోనూ అతడు ఓ చిత్రాన్ని చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











