రాజమౌళికి రాంచరణ్, మహేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు!
దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు నేడు. రాజమౌళి 45 పడిలోకి అడుగుపెట్టాడు. భారత చలన చిత్ర పరిశ్రమలో రాజమౌళి స్థానం ఏంటో అందరికీ తెలిసిందే. పరాజయమే లేకుండా జక్కన్న దూసుకుపోతున్నాడు. బాహుబలి చిత్రంతో రాజమౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు.
సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ రాజమౌళికి బర్త్ డే విషెష్ తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు హీరోలు రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా బాహుబలి 2 తరువాత రాజమౌళి మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. రాంచరణ్, ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని మాత్రం ప్రకటించాడు.

ఈ చిత్రం నవంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.


Click it and Unblock the Notifications











