మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్: రామ్ చరణ్‌ను ఆహ్వానించిన మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న వైభవంగా నిర్వహించబోతున్నారు. ఇది మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమా కావడంతో స్పెషల్‌గా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు మహేష్ బాబుతో పని చేసిన దర్శకులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

కాగా.. ఈ వేడుకకు మెయిన్ గెస్టుగా రామ్ చరణ్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. గతేడాది 'భరత్ అనే నేను' సినిమా ఈవెంట్ సమయంలో కూడా చరణ్‌కు ఆహ్వానం అందింది. అయితే అప్పుడు మెగా పవర్ స్టార్ స్కిప్ చేశారు.

Ram Charan main guest for Maharshi pre-release event

వాస్తవానికి గతేడాది ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ ఆహ్వానం అందింది. కానీ ఎన్టీఆర్ ఒక్కరే హాజరయ్యారు. అయితే ఫంక్షన్ ముగిసిన అనంతరం జరిగిన పార్టీలో చెర్రీ జాయిన్ అయ్యాడు. ఈ సారి కూడా ఈ ఇద్దరికీ ఆహ్వానం అందించగా... ఎన్టీఆర్ స్కిప్ చేసే ఆలోచనలో ఉన్నారని, చరణ్ హాజరయ్యే అవకాశం ఉందని టాక్.

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X