Ram Charan: మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.. ఏమన్నాడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నట వారసుడిగా 'చిరుత' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత మగధీర సినిమా విజయంతో టాలీవుడ్ స్టార్ హీరో హోదా అందుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు చరణ్. ఇలా వరుసగా విజయాలు అందుకుంటున్న రామ్ చరణ్ మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ 'ఈ-స్క్వేర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై చోటు దక్కించుకున్న టాలీవుడ్ హీరోగా అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి పై రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Also Read
Thimmarajupalli TV Twitter Review: తిమ్మరాజుపల్లి టీవీ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Thimmarajupalli TV Twitter Review: తిమ్మరాజుపల్లి టీవీ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?

ఈ సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, ముఖ్యంగా తండ్రి చిరంజీవి ప్రభావం గురించి మాట్లాడారు. "నా జీవితంలో నిజమైన హీరో నాన్నే" అని గర్వంగా చెబుతూ, చిరంజీవి తనకు కేవలం తండ్రి మాత్రమే కాకుండా, జీవితం ఎలా నడపాలో నేర్పిన మార్గదర్శకుడని సూచిస్తుంది. చిరంజీవి సాధించిన స్టార్‌డమ్ వెనుక ఎంతటి కష్టం ఉందో దగ్గరగా చూసిన వ్యక్తిగా తాను ఎంతో నేర్చుకున్నానని చరణ్ చెప్పాడు. "నాన్న స్థాయిని అందుకోవడం బయటకు సులభంగా కనిపించొచ్చు. కానీ ఆయన పడిన కష్టం, చేసిన త్యాగాలు అసాధారణం" అని చెప్పారు.

Recommended For You
Bhooth Bangla Twitter Review: భూత్ బంగ్లా ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ మూవీ ఎలా ఉందంటే?
Bhooth Bangla Twitter Review: భూత్ బంగ్లా ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ మూవీ ఎలా ఉందంటే?
Ram Charan Makes Emotional Comments About His Father Megastar Chiranjeevi

షూటింగ్ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటలే నిద్రపోయినా, పనిలో ఎలాంటి రాజీ పడకుండా పూర్తిస్థాయి అంకితభావంతో పనిచేసేవారనీ గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో ఎంత ఉన్నా కుటుంబ సమయం కేటాయించడంలో ఎప్పుడూ వెనుకాడడానికి లేదని చెప్పారు. ఇంట్లో చిరంజీవి ఒక సాధారణ తండ్రిలా ఉంటారని చరణ్ భావోద్వేగంగా చెప్పారు. స్టార్ ఇమేజ్‌ను బయట ఉంచి, ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా, ఆప్యాయంగా గడిపేవారని. "ఎంత స్టార్ అయినా ఇంట్లో మాత్రం సాధారణ మనిషిగా నాన్న ప్రత్యేకత" అని కొనియాడారు.

You May Also Like
ఆ కేంద్ర మంత్రితో ఎఫైర్‌? షాకింగ్ రిప్లై ఇచ్చిన కంగనా
ఆ కేంద్ర మంత్రితో ఎఫైర్‌? షాకింగ్ రిప్లై ఇచ్చిన కంగనా

ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని, అది కూడా తనకు పెద్ద పాఠమైందని అన్నారు. వృత్తిపరమైన బాధ్యతలు, కుటుంబ బంధాలను సమతౌల్యం (Work-Life Balance) చేసుకోవడం ఎలా అనేది చిరంజీవిని చూసే నేర్చుకున్నానని చరణ్ స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగడం, క్రమశిక్షణతో జీవించడం ఆయన తండ్రి నుంచి అందుకున్న విలువలని చెప్పారు. "మూడు రోజులు గ్యాప్ దొరికిన వెంటనే ఫ్యామిలీతో గడపాలని నాన్న కోరుకునేవారు. అదే ఇప్పుడు నాకు కూడా వచ్చింది" అని చెప్పారు. రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్‌పై తనకు ఉన్న గౌరవం, ప్రేమను చరణ్ వ్యక్తం చేసిన తీరు అభిమానులను మరింత ఎమోషనల్‌గా మార్చుతోంది.

శ్రీ రాముడిపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమంటోన్న హిందూ సంఘాలు
శ్రీ రాముడిపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమంటోన్న హిందూ సంఘాలు

ఇక కెరీర్ విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మొదట ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించారు, ప్రేక్షకులకు మరింత మెరుగైన థియేట్రికల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశ్యంతో జూన్‌కు వాయిదా వేశారు. పిరియాడికల్ టచ్‌తో, గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. నటుడిగా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఈ సినిమాతో మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.

Read more about: chiranjeevi tollywood ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X