సోనూసూద్ vs రామ్ చరణ్, బిగ్గెస్ట్ ఫైట్.. ప్రభాస్ స్టైల్ లోనే..
టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఆడియెన్స్ లో అంచనాల డోస్ ను మరింత పెంచేస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సెక్వెన్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట.
మెగాస్టార్ చిరంజీవి సైరా అనంతరం ఎంతో ఇష్టపడి కొరటాల శివతో ఆచార్య స్క్రిప్ట్ ను రెడీ చేయించారు. అభిమానులను అంచనాలను అందుకునేలా ప్రతి ఎపిసోడ్ ను ఎంతో కాస్ట్లీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ కు సంబంధించిన ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా ఉంటాయట. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సోనూసూద్ తో చేసే ఫైట్ కొరటాల మార్క్ కు తగ్గట్టుగా ఉంటుందట.

మిర్చి సినిమాలో ఆడియెన్స్ కు ఎక్కువగా నచ్చిన ఫైట్స్ లలో రెయిన్ ఫైట్ ఒకటి. ఇక ఆచార్య లో కూడా రామ్ చరణ్ - సోనూసూద్ వర్షంలో పోరాడే సన్నివేశాలు సినిమాకు మరింత బలాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆచార్య పనులు దాదాపు ఏండింగ్ కు వచ్చేశాయి. ఇక సినిమాని మే 14న రిలీజ్ చేయాలని అనుకుంటున్నప్పటికి పరిస్థితులు అనుకూలించేలా కనిపించడం లేదు. అందుకే సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











