రామ్ చరణ్ మంచి మనసు.. క్యాన్సర్ తో బుల్లి అభిమాని పోరాటం, కోరిక తీర్చిన చెర్రీ.. ఫొటో వైరల్!

హీరోలు అంటే అనేకమందికి అభిమానం ఉంటుంది. కానీ కొందరికీ మాత్రం వాళ్లంటే అమితమైన పిచ్చి ప్రేమ. అందుకే వారికోసం తహతహలాడిపోతారు. అందులోను చిన్నారులకు నేటి కథానాయికులను చూస్తే రియల్ సూపర్ హీరోస్ ల భావిస్తారు. అందుకే వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తారు. వాళ్లను ఒక్కసారి అయిన చూడాలని తెగ కోరుకుంటారు. ఇలా తాజాగా ఓ చిన్నారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను చూడాలని కోరాడు. దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఆ బాబు కలను నెరవేర్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత మూవీ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాడు. తర్వాత మగధీర సినిమాతో చిన్నా పెద్దా అని తేడ లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. వరసుగా పలు సినిమాలు చేస్తూ మెగా పవర్ స్టార్ గా మారిన చెర్రీ.. ఇటీవల RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అల్లూరి సీతారామరాజుగా అలరించిన రామ్ చరణ్ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన చెర్రి తాజాగా తన మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ బుల్లి అభిమానిని స్వయంగా కలిసి పరామర్శించాడు.

Ram Charan Met His Fan Child Who Suffers With Cancer Photo Goes Viral

క్యాన్సర్ తో పోరాడుతున్న మణి కౌశల్ అనే బుల్లి అభిమానిని తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి.. అతనిలో ఆత్మ విశ్వాసం నింపాడు. అలాగే ఆ చిట్టి అభిమాని కళ్లలో సంతోషాన్ని చూసేందుకు రామ్ చరణ్ తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే క్యాన్సర్ తో పోరాడుతున్న మణి కౌశల్ అనే పిల్లాడు మేక్ ఏ విష్ ఫౌండేషన్ కి తన కోరికను విన్నవించుకున్నాడు. ఈ సంస్థ ద్వారా ఆ చిన్నారి కోరికను రామ్ చరణ్ తెలుసుకున్నాడట. తన తొమ్మిదేళ్ల బుల్లి అభిమాని అలాంటి స్థితిలో ఉండటం చూసి చలించిన రామ్ చరణ్ ఆ పిల్లాడు చికిత్స పొందుతున్న స్పర్ష్ హాస్పైస్ హాస్పిటల్ కు వెళ్లాడు. ఆ పిల్లాడితో సరదాగా ముచ్చటించాడు రామ్ చరణ్.

మణి కౌశల్ తో సరదాగా గడిపిన రామ్ చరణ్ అతన్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలా సడెన్ గా రామ్ చరణ్ సర్ ప్రైజ్ ఇవ్వడం, ప్రత్యేకంగా గిఫ్ట్ అందించడంతో ఆ పిల్లాడికి ఎంతో సంతోషం కలిగిందట. అలాగే ఆ బాబుకి క్యాన్సర్ నుంచి పోరాడే బలాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందిచాడని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు చెర్రీ మంచి మనసు చూసి పొగుడుతున్నారు. మా చెర్రీ బంగారం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X