RC15: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అనుకున్న దానికంటే ముందే!

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంటర్ అయినా.. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతోన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హీరోగా కెరీర్‌ను మొదలు పెట్టిన తొలినాళ్లలోనే పలు భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దీనికితోడు విజయాలు కూడా సొంతం అవుతుండడంతో చరణ్ మరింత జోష్‌తో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు.

ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేషనల్ రేంజ్‌లో సత్తా చాటుతోన్న దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి క్రేజ్ జాతీయ స్థాయికి పెరిగిపోయింది. ఈ ఉత్సాహంలో ఉన్న రామ్ చరణ్‌కు 'ఆచార్య'తో బిగ్ షాక్ తగిలింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ డిజాస్టర్‌ అయిపోయింది. అయితే, ఈ ఫలితాన్ని పట్టించుకోకుండా రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

Ram Charan Movie Shooting Resume From September 1st Week

దిగ్గజ దర్శకుడు శంకర్ రూపకల్పనలో రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా క్లైమాక్స్ పార్టును షూట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీనికోసమే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారని ఫిలిం నగర్ ఏరియాలో భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. దీనితోపాటే ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయాలని ప్లాన్ చేశారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అంతేకాదు, శంకర్ 'ఇండియన్ 2' మూవీని మళ్లీ మొదలు పెట్టేశారు.

రామ్ చరణ్ హీరోగా శంకర్ తీసే సినిమా షూట్ ఆగిపోవడంతో ఇది ఇప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీని గురించి ఓ ఆప్‌డేట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్‌లు మొదలు కాబోతున్నాయి. దీంతో వచ్చే నెల మొదటి వారంలోనే రామ్ చరణ్ - శంకర్ మూవీ చిత్రీకరణను పున: ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, దీన్ని ఏమాత్రం బ్రేకులు లేకుండా పూర్తి చేయబోతున్నారట. అంటే.. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమాను పూర్తి చేస్తున్నారని తెలిసింది. ఇదే నిజం అయితే మెగా అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు.

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X