టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కోవిడ్ భారిన పడిన విషయం తెలిసిందే. పెద్దగా లక్షణాలు ఏమి లేకపోయినా కూడా టెస్ట్ లో పాజిటివ్ అని రావడంతో చరణ్ వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో RRRకు సంబంధించిన షెడ్యూల్ కాస్త మళ్ళీ మార్చాల్సి వస్తోంది. అయితే ఆ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అనంతరం చరణ్ ఏ దర్శకుడితో వర్క్ చేస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.
మరోవైపు తనతో పాటు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ అయితే త్రివిక్రమ్ తో ఎప్పుడో ఒక సినిమా సెట్ చేసుకున్నాడు. మరోవైపు దర్శకుడు రాజమౌళి కూడా లాక్ డౌన్ లో మహేష్ కోసం ఒక ప్రాజెక్టును అయితే ప్లాన్ చేసుకున్నాడు. కానీ రామ్ చరణ్ లాక్ డౌన్ లో ఒక్క కథను కూడా ఓకే చేయలేదు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ జెర్సీ దర్శకుడితో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి ప్రస్తుతం జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో అదే కథను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అరవింద్ గౌతమ్ వద్ద ఇటీవల ఒక అద్భుతమైన స్క్రిప్ట్ విన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కు అయితే ఆ కథ కరెక్ట్ గా సెట్టవుతుందని దర్శకుడికి ముందే ఒక క్లారిటీ ఇచ్చాడట.
ఛాన్స్ ఇస్తే తప్పకుండా రామ్ చరణ్ కు కథ చెబుతానని అనడంతో అల్లు అరవింద్ చరణ్ కు కూడా ఫోన్ చేసి మ్యాటర్ చెప్పినట్లు సమాచారం. అయితే కథ వినడానికి సిద్ధం కాగా ఇంతలో చరణ్ కు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇక కరోనా నుంచి కోలుకున్న తరువాత దర్శకుడు మెగా హీరోకు కథను చెప్పి ఒప్పించాలని అనుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Director Rajamouli described his experiences as well as future plans in his first interview after recovering from Corona. Rajamouli, who fell a corona heavy a few days ago, has recently become an ideal for everyone with a plasma donation. However, in Corona Time, he said that he followed two things regularly and was scared of the virus. He also spoke on RRR, Mahabharata and Adi Purush projects.
Story first published: Wednesday, December 30, 2020, 17:16 [IST]