Ram Charan: RC17కి అంతా సిద్ధం.. పుష్ప డైరెక్టర్‌తో గ్లోబల్ స్టార్!

ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు పాటతో గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమా తర్వాత నుంచి చెర్రీ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రాజెక్టులతో వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈయన గేమ్ ఛేంజర్ సినిమా చేస్తుండగా.. ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే గేమ్ ఛేంజర్ ఆయన 15వ సినిమా కాగా.. 16వ సినిమాను బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా పట్టాలు కూడా ఎక్కకముందే మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా RC17 సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ram Charan Next Movie RC17 Confirmed With Director Sukumar Check Details

శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇంకా విడదల తేదీ కూడా కన్ఫార్మ్ కాకముందే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తన నెక్ట్స్ సినిమాను లైన్ లో పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకున్నారు.

ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత నుంచి చెర్రీ పెద్ద సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. అంతోలనే మరో క్రేజీ కాంబోకు శ్రీకారం చుట్టాడు రామ్ చరణ్. తన 15 సినిమా రిలీజ్ కాకుందే, 16వ సినిమా ప్రకటించడం.. ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలు కాకముందే నెక్ట్స్ సినిమాను కూడా ఫిక్స్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అలాగే నెక్స్ట్ ఎవరి కాంబోలో చేయబోతున్నాడో తెలుసుకుని థ్రిల్ అవుతున్నారు.

Ram Charan Next Movie RC17 Confirmed With Director Sukumar Check Details

ముఖ్యంగా రామ్ చరణ్ 17వ సినిమా RC17కు పుష్ప డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. పుష్ప షూటింగ్ అయి విడుదల అయిన తర్వాత RC17పై ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై RC17 చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రముఖు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సనిమాకు సంగీతం అందించబోతున్నట్లు హోలీ సందర్భంగా ప్రకటించారు.

వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు నమోదుకాగా.. వాట‌న్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు సుకుమార్‌. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొద‌లు పెడ‌తారని తెలుస్తోంది. అలాగే 2025 చివరి మూడు నెలల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారట. రామ్‌ చ‌ర‌ణ్‌, సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేష‌న్‌కి రాక్‌స్టార్‌, మ్యూజిక్ సెన్సేష‌న్ దేవిశ్రీ ప్ర‌సాద్ పేరు తోడ‌వ‌డం అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ మ‌రోసారి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X