twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Puneeth కుటుంబానికి చరణ్ పరామర్శ.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!

    |

    కన్నడ 'పవర్‌స్టార్' పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న కన్నుమూశారు. ఈ కారణంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులే కాదు ప్రతి దక్షిణ భారతీయుడి గుండె బరువెక్కి ఉంది. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు, అంతకుముందు కూడా రామ్ చరణ్ తన నివాళులు అర్పించలేకపోయాడు. ఈ నేపథ్యంలో శంకర్‌ డైరెక్షన్లో జరుగుతున్న #RC15 షూటింగ్ నుంచి విరామం తీసుకుని వారి కుటుంబాన్ని సందర్శించడానికి ఈ రోజు కర్ణాటకకు వెళ్లారు. ఆ వివరాల్లోకి వెళితే

     ట్విట్టర్ లో అలా

    ట్విట్టర్ లో అలా

    పునీత్ మరణ వార్త విన్న తర్వాత, రామ్ చరణ్ ట్విట్టర్‌ ద్వారా తన బాధను వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. "జీర్ణించుకోలేకపోతున్నాను, నా ప్రియమైన #పునీత్ రాజ్‌కుమార్ గారు నేను కలిసిన అత్యంత గొప్ప, మరియు నిజమైన వ్యక్తి. ఆయన కుటుంబానికి మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి! మేము నిన్ను చాలా మిస్ అవుతాము డియర్ బ్రదర్!!" అంటూ ఆయన బాధ వ్యక్తం చేశారు.

     నిన్ననే షూట్‌ ముగించి

    నిన్ననే షూట్‌ ముగించి

    ఇక అంత్యక్రియల తర్వాత, ఇతర పరిశ్రమలకు చెందిన పలువురు హీరోలు పునీత్ కుటుంబాన్ని కలుస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఈరోజు రాజ్ కుమార్ కుటుంబాన్ని కలుసుకుని తన సానుభూతి తెలియజేసినట్లు సమాచారం. చరణ్ పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌తో మాట్లాడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చరణ్ శంకర్‌తో కలిసి తన కొత్త సినిమా స్పెషల్ సాంగ్ షూట్‌ను నిన్ననే ముగించాడు.

    జీర్ణించుకోలేక పోతున్నా

    జీర్ణించుకోలేక పోతున్నా

    ఇక పరామర్శించిన అనంతరం ఆయ‌న అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ ''పునీత్‌గారు చ‌నిపోవ‌డం మా కుటుంబంలో వ్య‌క్తిని పొగొట్టుకున్నంత బాధ‌గా ఉందని అన్నారు. పునీత్ కు అలా జ‌ర‌గ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని పేర్కొన్న ఆయన, మాట‌లు కూడా రావ‌డం లేదని అన్నారు. ఇది అస‌లు జ‌రిగిందా? అనే షాక్‌లో ఉన్నామని ఆయన అన్నారు.

    సొంతవాళ్ల‌లా చూసుకుంటారు

    సొంతవాళ్ల‌లా చూసుకుంటారు

    ఎంతో మ‌ర్యాద‌పూర్వ‌కంగా, ప్రేమ‌తో ఉండే వ్య‌క్తి పునీత్‌ ఆయ‌న లాంటి వ్య‌క్తికి ఇలా జ‌ర‌గ‌డం ఎంతో బాధాక‌రంగా ఉందని రామ్ చరణ్ అన్నారు. ఒకే వేళ పునీత్ మా ఇంటికొస్తే ఆయ‌న ముందు మేమే గెస్ట్‌లాగా ఫీల‌య్యేలా చేస్తారన్నా ఆయన పునీత్ అందరు వ్య‌క్తుల‌ను సొంతవాళ్ల‌లా చూసుకుంటారని అన్నారు. అసలు సాధార‌ణ వ్య‌క్తిలా ఎలా ఉండాల‌ని ఆయ‌న్ని చూసి నేర్చుకోవాలని రామ్ చరణ్ అన్నారు.

     చాలా విష‌యాలు నేర్చుకోవాలి

    చాలా విష‌యాలు నేర్చుకోవాలి

    పునీత్ ఇండ‌స్ట్రీకి, సోసైటీకి ఎంతో చేశారు. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి. ఆయ‌న్ని ఎంతో మిస్ అవుతున్నాం అని అన్నారు. ఇక కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయానికి అంత్యక్రియలు చేసిన కంఠీరవ స్టూడియో ప్రాంగణంలో సాంప్రదాయ పూజలు నిర్వహించారు వారి కుటుంబ సభ్యులు. నిషేధ ఉత్తర్వు అమల్లో ఉన్నప్పటికీ, వేలాది మంది అభిమానులు స్టేడియం ప్రాంగణాన్ని చుట్టుముట్టారు, తమ అభిమాన తారకు నివాళులు అర్పించేందుకు లోపలికి అనుమతించాలని కోరారు.

    ఒత్తిడికి తలొగ్గి

    ఒత్తిడికి తలొగ్గి

    చివరికి ప్రభుత్వం వారి ఒత్తిడి కారణంగా ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ఇక పునీత్ అన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్ మాట్లాడుతూ, తన తమ్ముడు అందరివాడు కాబట్టి మా కుటుంబ పూజలు కూడా పూర్తి అయినందున ఎప్పుడైనా అతని సమాధిని సందర్శించవచ్చని చెప్పాడు. పునీత్ భార్య అశ్విని, కుమార్తెలు ధృతి మరియు వందన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ పూజలు చేశారు.

    English summary
    Ram Charan paid condolences to Puneeth Rajkumar's family in bangalore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X