Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ మళ్లీ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది (Peddi). ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తి రగ్గడ్ మాస్ లుక్‌లో కనిపించబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అలాగే సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా మేళవింపుతో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ పాటలు కూడా అంచనాలను మరింత పెంచేశాయి. మొత్తం మీద కంటెంట్ పరంగా 'పెద్ది' ఒక పవర్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇలా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా నుంచి తాజాగా షాకింగ్ అప్డేట్ వచ్చింది.

Ram Charan Peddi Postponed Again Makers Shift Release to June for Perfection

వాస్తవానికి పెద్ది సినిమాను మొదట మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ తేదీని ఏప్రిల్ 30కు మార్చారు. ఇప్పుడు ఆ తేదీ కూడా మారిపోయి, సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో.. పెద్ది వాయిదా నిర్ణయానికి గల కారణాలను వివరించింది.

"పెద్ది"కి సంబంధించిన పాటలు, గ్లింప్సెస్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుత స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన టీమ్, సినిమా టాకీ పార్ట్ పూర్తయిందని. ప్రస్తుతం ఒక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఫైనల్ ఎడిట్ చూసిన మేకర్స్ ఔట్‌పుట్‌పై పూర్తి సంతృప్తికరంగా ఉందని చెప్పడం విశేషం.అయితే, కంటెంట్ బలంగా ఉన్నందున దాన్ని ప్రేక్షకులు ముందుకు మరింత పర్ఫెక్ట్‌గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమ్ స్పష్టం చేసింది.

ముఖ్యంగా టెక్నీషియన్లు, పోస్ట్ ప్రొడక్షన్ టీం తమ బెస్ట్ ఇవ్వడానికి తగిన సమయం ఇవ్వడం ముఖ్యం అని, అదే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించే మార్గమని చిత్రబృందం స్పష్టం చేసింది. ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతి ఇవ్వడం తమ బాధ్యత అని అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని త్వరలోనే అని మేకర్స్ చెప్పారు. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ ఉంటుంది. క్వాలిటీ కోసం తీసుకున్న నిర్ణయం చాలా మంది దీనిని అంగీకరిస్తున్నారు. జూన్‌లో విడుదల తేదీపై కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అదే సమయంలో ఇతర పెద్ద సినిమాల విడుదల కారణంగా క్లాష్ ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే మేకర్స్ ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించడం అన్ని ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఇక సినిమా విషయానికి వస్తే, 'పెద్ది' 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ 'పెద్ది పహిల్వాన్' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర యాసను నేర్చుకోవడం విశేషం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే గ్రామీణ యువతిగా నటిస్తోంది. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సాయి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత A. R. రెహమాన్ అందించడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ బజ్ ఉంది. వాయిదా కారణంగా విడుదలైన ఆలస్యమైనా, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. మొత్తంగా చూస్తే, 'పెద్ది' వాయిదా మెగా అభిమానులకు కొంత నిరాశ కలిగించింది, క్వాలిటీ కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఫలితాన్ని జూన్‌లో బాక్సాఫీస్ వద్ద ఎలా చూపిస్తుందో అన్న ఆసక్తి పెరుగుతోంది.

Read more about: buchi babu sana ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X