బుచ్చిబాబు మూవీలో రోల్ లీక్ చేసి రామ్ చరణ్.. చిరంజీవిని గుర్తు చేసేలా ఆ సీన్లు

టాలీవుడ్‌లో ఎంతో మంది బడా హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే వరుసగా హిట్లను సాధిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. దీనికితోడు ఈ మధ్య కాలంలో అతడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుని గ్లోబల్ స్టార్‌గా కూడా ఎదిగిపోయాడు. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటున్నాడు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. దీన్ని వచ్చే డిసెంబర్‌లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

Ram Charan Plays Comedy Role In Buchi Babu Sana Movie

'గేమ్ చేంజర్' సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోందని ఇప్పటికే సమాచారం లీక్ అయింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని, రన్నర్‌గా చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది.

హై రేంజ్ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను బుచ్చిబాబు సన వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్టును రెడీ చేయడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇలా అక్టోబర్ లేదా నవంబర్‌లో దీన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో రామ్ చరణ్ పాత్రపై క్రేజీ న్యూస్ లీకైంది.

Ram Charan Plays Comedy Role In Buchi Babu Sana Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఇందులో తన రోల్ కామెడీని పంచుతుందని, సినిమా ఫస్టాఫ్ అంతా ఫన్నీ సీన్స్‌తో నిండిపోయి ఉంటుందని చెప్పాడు. ఒక రకంగా 90 దశకంలో వచ్చిన చిరంజీవి ఫన్నీ రోల్స్‌ను ఇది గుర్తు చేసేలా ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నారు. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని ఇస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan buchi babu sana rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X