RC15: ఆ పార్టీ కోసం రంగంలోకి రామ్ చరణ్.. ప్రభుత్వంపై పదునైన అస్త్రాలతో!

బడా హీరో కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన చిత్రాలను చేస్తూ కెరీర్ ఆరంభం నుంచే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఫలితాలను బేరీజు వేసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. క్రమంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతడు RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ మూవీతో అతడి క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. కానీ, తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం బిగ్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. అలాగే, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగాన్ని షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికోసం ఎన్నో ముఖ్యమైన భారీ సెట్‌లను కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

Ram Charan Political Leader Role in Shankar Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడన్న న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో సెకెండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని తెలిసింది. అది పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుదని అంటున్నారు. ఇక, ఈ పాత్ర ప్రత్యర్థి వర్గంపై పోరాటం చేసే సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా చరణ్ చెప్పే పొలిటికల్ డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయే పరిస్థితి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Ram Charan Political Leader Role in Shankar Movie

ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X