Ori Devuda Event: విశ్వక్ సేన్ కు నేను పెద్ద ఫ్యాన్.. అతను మాట ఇస్తే అలా ఉంటుంది: రామ్ చరణ్
విశ్వక్ సేన్ నటించిన ఊరి దేవుడా సినిమా ఈ దీపావళికి అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించారు. వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన విధానం ఫాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇక రామ్ చరణ్ ఏం మాట్లాడారు అనే వివరాల్లోకి వెళితే..

మరోసారి రుజువు చేశారు
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాన్నగారు నేను అలాగే అభిమానులు అందరూ కూడా సినిమాను ఎంతగా ఆదరిస్తారో తెలుసు. ఒక మంచి సినిమాకు మా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు మరోసారి రుజువు చేశారు అందుకు నేను గర్వపడుతున్నాను.

ఆయన కోసం చూడాలి
ఇక ఈ సినిమాకు ప్రత్యేక అతిథిగా నన్ను ఆహ్వానించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే పివిపి ప్రొడక్షన్ వాళ్ళు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీస్తారు. వాళ్లకు కూడా నా విశేస్ అందిస్తున్నాను. సినిమా ట్రైలర్ చూడగానే చాలా బాగా నచ్చింది. తప్పకుండా సినిమా బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. మంచి కామెడీ ఉన్న సినిమాలను ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ గారు ఒక చిన్న పాత్రలో కనిపిస్తున్నారు. చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది తప్పకుండా వెంకటేష్ గారి కోసం అయినా సినిమా చూడాలి.. అని అన్నారు.

ఉపాసన కూడా తనకు ఫ్యాన్
అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మిథిలా పాల్కర్ నటించిన లిటిల్ థింగ్స్ అనే వెబ్ సిరీస్ బాగా నచ్చింది. ఉపాసన కూడా తనకు మంచి ఫ్యాన్. అలాగే మరొక హీరోయిన్ ఆశకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. విశ్వక్సేన్ గురించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు గల్లీ గల్లీలో మీ పేరు తెలియనోళ్లు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ తో అందరి గుండెల్లో చోటు దక్కించుకున్నాడు.. అని చరణ్ అన్నారు.

గల్లీ గల్లీ లో విశ్వక్ సేన్ కు ఫ్యాన్స్
ఫలక్ నుమా నుంచి రాజమండ్రి వరకు వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లి గల్లి లో విశ్వక్ సేన్ కు ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఫలక్నామా దాస్ అనే సినిమా చూశాను. అతనికి యూత్ రెబల్ ఫాన్స్ అయితే చాలా బాగున్నారు. అతని పర్సనాలిటీకి నేను కూడా ఫ్యాన్. సినిమాలో హీరో కన్నా బయట అతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. ఎందుకంటే అతను మాట ఇచ్చాడు అంటే తప్పకుండా దాని మీద నిలబడతాడు అనేది బయట కూడా ఒక టాక్ ఉంది.. అని చరణ్ అన్నారు.

మంచి స్టార్ గా ఎదగాలని
కొన్నిసార్లు తన పక్క వారి కోసం విశ్వక్ నిలబడడం. ఏం సహాయం కావాలన్నా చాలా సపోర్ట్ గా ఉంటాడు అలాగే అతను మంచి స్టార్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రజనీకాంత్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మంచి పర్సనాలిటీ తోనే వాళ్ళు సూపర్ స్టార్ గా ఉన్నారు.. అలాంటి మంచి లక్షణం నీలో ఉంది.. అని విశ్వక్ గురించి చరణ్ చెప్పారు.
ఆ రేంజ్ లో హిట్ అవ్వాలి..
ఇక ఓరి దేవుడా అనే ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లోకి రాబోతోంది. మీరందరూ తప్పకుండా అందరూ చూడాలి. ఇక ఈ దీపావళికి ఈ సినిమా ఫెస్టివల్ గా ఉంటుందా అనేది చూడాలి. మీ అందరి ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉండాలి. ఇది ఒక మంచి కామెడీ ఫీల్ ఉన్న సినిమా. దాని కన్నా ఒక మంచి ఫెస్టివల్ ఇంకేం కావాలి. నేను ఎప్పుడూ రాజమండ్రి కి వచ్చినా కూడా ఏదో ఒక ఈవెంట్ పెడుతున్నారు అనిపిస్తోంది. రంగస్థలం జరిగినప్పుడు ఉప్పెన ఈవెంట్ జరిగింది. ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇదే సినిమా కోసం రాజమండ్రి వచ్చాను. ఈ సినిమా కూడా అంత బాగా కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అని రాంచరణ్ మాట్లాడారు.


Click it and Unblock the Notifications











